గర్భధారణ సమయంలో గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక చాలామందికి మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలీదు. గర్భవతి కాకముందు ఏది పడితే అదే తింటుంటారు. అయితే డాక్టర్లు సూచించినా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది పౌష్టికాహారం తీసుకోలేరు. అంతేకాదు.. చేయవద్దని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. కాగా.. గర్భిణులు ఆరోగ్యాంగా ఉంటేనే పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే గర్భిణులు ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు చాలా పుష్టిగా ఆరోగ్యంగా వుంటారని అన్నారు. అంతేకాదు.. గర్భిణీలు ఖచ్చితంగా రోజుకి ఐదారు మీల్స్ తీసుకోవాలని చెబుతుంటారు. ఇక ఉదయం బ్రేక్ ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఈవెనింగ్ స్నాక్, డిన్నర్ ఇలా రాత్రి నిద్రకి ముందు ఇలా తీసుకోవాలని అన్నారు. గర్భిణులు తీసుకునే ప్రతి ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

అంతేకాకుండా గర్భిణులు పాలు తీసుకుంటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. కాగా గర్భిణులకు ఎలాంటి ఆహారం బాగుంటుందనేది ఒకసారి తెలుసుకుందామా. సాధారణంగా పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే పాలలో క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు.. గర్భిణీలు పాలు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో సోయా మిల్క్ తాగడం కూడా చక్కటి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

గర్భిణిలలో ఎనీమియా సమస్య రాకుండా ఇది చూస్తుంది. అంతేకాక.. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. అయితే ఆవుపాలు, గేదె పాలు నచ్చని వాళ్ళు సోయా మిల్క్ తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. గర్భిణీలు వీటిని తీసుకుంటే ఏ సమస్య లేకుండా ఉండొచ్చునని అంటున్నారు. ఇక పుట్టబోయే బిడ్డకూ ఆరోగ్యం. బట్టర్ మిల్క్ లో విటమిన్ b12, ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. ఇక మీల్ కి మీల్ కి మధ్యలో బట్టర్ మిల్క్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: