పిల్లలకు జన్మనివ్వాలని పెళ్లైన ప్రతీ మహిళ ఎన్నో కలలు కంటుంది. మహిళలు గర్భం దాల్చిన తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలిసి ఉండదు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు ఏది పడితే అది తినొద్దని నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భధారణ ప్రభావంగా మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారని అన్నారు. ఇక నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుందని చెబుతున్నారు.

అయితే గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతారని చెప్పుకొచ్చారు. అంతేకాక.. గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటుందని అన్నారు. దాని కారణంగా మహిళల నిద్రకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెప్పుకొచ్చారు. ఇక లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా నిద్ర లేస్తారని అన్నారు. అయితే మళ్లీ పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర పట్టదని ఆరోగ్య నిపుణులు చెప్పుకొచ్చారు.

అంతేకాక.. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక వైద్యుల సలహా మేరకు గర్భిణులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు వారి కాళ్లు తిమ్మిరెక్కడం సహజంగా ఉంటుందన్నారు. అలాగే కొందరి కాళ్లు వాపుగా కనిపిస్తాయని అన్నారు. ఆలా కాలు తిమ్మిరెక్కినప్పుడు కూడా నిద్రకు భంగం వాటిల్లుతుందని అన్నారు.

అంతేకాదు.. గర్భిణులకు తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుందని అన్నారు.  కాగా.. గర్భధారణ చివరి దశలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాక.. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టీ, కాఫీ లాంటివి తాగుతుంటారు. అయితే వీలైనంత వరకు వాటిని దూరం పెట్టాలని చెబుతున్నారు. అంతేకాక.. ఆహారపు అలవాట్లు కూడా ఓ సమస్యే అని అన్నారు. గర్భధారణ సమయంలో గర్భిణులు ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: