ప్రతి అమ్మాయి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. బిడ్డ పుట్టిన తరువాత తల్లిపాలు పట్టాలని వైద్యులు చెబుతున్నారు. అయితే సాధారణంగా రెండు నెలలు పూర్తయ్యే వరకూ రోజుకు 8 నుండి 12 సార్లు వరకు తినేలా చూసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలకు రెండు మూడు గంటలకి ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలని చెబుతున్నారు. అయితే తల్లి పాలు మాత్రమే తాగించితే గంటన్నరకు ఒకసారి పాలు ఇవ్వొచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లల నిద్రపై ఆధారపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. వారు మెలకువగా ఉన్నప్పుడు సమయం చూసుకుని బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలని వెల్లడించారు.

అయితే తల్లి పాలు అందించేటప్పుడు 10 నుండి 20 నిమిషాల వరకు ఇవ్వచ్చునని అన్నారు. కొన్నిసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఒక బ్రెస్ట్ నుండి మాత్రమే కాకుండా రెండింటి నుండి పాలు ఇచ్చేలా చూసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా పిల్లలకు నాలుగు నెలలు లేదా 17 వారాలు వచ్చే సరికి తల్లి పాలతో పాటు సాలిడ్ డైట్‌ని కూడా అందించాలని చెబుతున్నారు. పిల్లలకి  కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే పెట్టాలని చెబుతున్నారు. ఇక పిల్లలో జరిగే మార్పులను గమనిస్తూ ఆహారాన్ని అందించాలని అన్నారు.

అలాంటి సమయంలో పిల్లలకు సాలిడ్ డైట్‌ను చాలా మెత్తగా చేసి పెట్టాలని చెబుతున్నారు. ఇక మిగతా సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చనని అన్నారు. పిల్లలకు ఆరు నెలలు ముందు ఆహారాన్ని ఇవ్వడానికి, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి కొంత సమయం గ్యాప్ తీసుకోవాలి చెబుతున్నారు. అంతేకాదు.. ఆరు నెలలు వచ్చేసరికి మరి కొంత గ్యాప్ ఇవ్వవచ్చునని అన్నారు. ఇక పిల్లలకి వయసు పెరిగే కొద్దీ గ్యాప్‌ను పెంచవచ్చునని అన్నారు. అయితే ఆరు నెలలు తర్వాత ఆహారపు అలవాట్లు మారుతాయని అన్నారు. అంతేకాదు.. డైట్‌లో మీకు, మీ బిడ్డకు నచ్చిన మార్పులను చేసుకోవచ్చునని అన్నారు. వాటిపైనే పిల్లల యొక్క ఎదుగుదల ఉంటుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: