మహిళలు సాధారణ సమయంతో పోలిస్తే గర్భధారణ సమయంలో చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. వారు వారు ఎన్నో నియమాలు పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణులు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతుంటారు. గర్బధారణ సమయంలో తీసుకునే ఫుడ్ తల్లితో పాటు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

ఇక అందుకే గర్బధారణ సమయంలో గర్భిణీలను పోషకాహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రెగ్నెన్సీ మహిళలకు మేలు చేసే ఆహారాల్లో బ్రోకలీ ఒకటి అని చెప్పాలి. అయితే చాలా మంది గర్భిణీల్లో బ్రోకలీని తినొచ్చా..? తినకూడదా..? అన్న సందేహాలు వస్తుంటాయి. ఇక నిపుణులు మాత్రం నిశ్చింతగా తినొచ్చని చెబుతున్నారు. బ్రోకలీని గర్భిణులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు మధుమేహానికి గురవుతుంటారు. అలాంటి సమయంలో బ్రోకలీని డైట్‌లో చేర్చుకుంటే.. అందులో పలు పోషకాలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచి డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను తగ్గిస్తాయని అన్నారు. అంతేకాదు.. గర్భిణీలు బ్రోకలీని తినడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను నివారించడానికి కూడా దోహదపడుతుంది. ఇక బ్రోకలీని తీసుకుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది రక్త హీనతను నివారించవచ్చు.

అంతేకాక.. బ్రోకలీని ఆహారంలో భాగంగా చేసుకుంటే గర్భిణీల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కంటి ఆరోగ్యం రెట్టింపు అవుతుందని అన్నారు. అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారి మలబద్ధకం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయని అన్నారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడుతుంటారని అన్నారు. అలాంటి వారు బ్రోకలీని తింటే.. అందులోని పలు విటమిన్లు, ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ చర్మ సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: