'' మోసం చెయ్యడం తప్పు కాని మోసపోవడం తప్పు కాదు. కన్నీళ్లు చాలా విలువైనవి విలువ లేని వాళ్ళకోసం వేస్ట్‌ చేయకూడదు.''

అనే జీవన సత్యాన్ని భవానీ జీవితంలో చూశాం.


'గుండెకింద తడి ఉంటే ఈ కథ చదవండి 'అంటూ,ఆమె గురించి ఏపీ హెరాల్డ్‌ లో రాసినపుడు,( https://www.apherald.com/Women/ViewArticle/351411/bhavani-kolla) గల్ఫ్‌ నుండి ఒక ప్రవాస భారతీయుడు స్పందించి, భవానీ తో ఫోన్‌లో మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకున్నారు.                  ఈ సందర్భంగా ఆమె ఈ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు.


'' మీరు ఎపీ హెరాల్డ్‌ వెబ్‌ సైట్‌లో నా కష్టాల జీవితం గురించి రాశారు. రాష్ట్రం నుండే కాక ,విదేశాల నుండి కూడా ఎందరో ఫోన్‌ చేసి సానుభూతి తెలిపారు. అలాగే దుబాయి నుండి ఒక సారు ఫోన్‌ వారికి తెలిసిన వారిని గుంటూరు పంపించి నా కోసం ఎంక్వయిరీ చేయించారు. ఆటో నడుపుతున్న నా వద్దకు వచ్చి, రూ.10వేలు ఆర్ధిక సాయం చేసి వెళ్లారు. వారు త్వరలో మీతో కూడా మాట్లాడతామన్నారు.. నాజీవిత కథను ప్రచురించిన ఏపీ హెరాల్డ్‌ వారికి ధన్యవాదాలు.'' అని ఆమె ఉధ్వేగంగా చెప్పింది.


గుంటూరులో అనేక సమస్యలు ఎదుర్కొని ఆటో డ్రైవర్‌గా, జీవిస్తున్న భవానీ తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. తనకొచ్చిన అతి తక్కువ ఆదాయంతో అప్పులు చేసి బతుకుతున్నారు. తనకు జీవనాధారమైన ఆటో మీద కూడా అప్పు ఉందని ఆమె అన్నారు. తల్లి పడుతున్న కష్టాలు చూడలేక ఒక కుమారుడు చదువు మానేసి పనికి వెళ్తూ ఆమెకు చేదోడుగా ఉన్నాడు.


ప్రభుత్వం తమ కుటుంబానికి నీడ(ఇల్లు)ను కల్పించాలని ఆమె కోరుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు కలెక్టరాఫీసు చుట్టూ తిరుగుతున్నప్పటికీ సాయం అంద లేదని ఆమె ధీనంగా చెప్పారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆమెకు సాయం చేస్తారని ఆశిద్దాం. భవానీకి చేయూతనివ్వాలనుకునే వారు, ఆమె సమస్యలను ప్రభుత్వం మందుంచాలనకునే వారు ఈ నెంబర్‌ (6300051162) లో సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: