ఒక భర్త, ఏడుగురు భార్యల వింత ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.  ఏదేదో సినిమా టైటిల్ అనుకుంటే పొరపడినట్టే. నిజంగానే ఒక భర్త కోసం ఏకంగా ఏడుగురు మహిళలు ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి నా భర్త అంటే నా భర్త అంటే ఎవరికైనా పిచ్చిలేస్తుంది కదూ. హరిద్వార్‌ లోని పోలీసులే కాదు స్థానికులకు కూడా మతిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది.   అసలేం జరిగిందంటే.. హరిద్వార్‌లోని రవిదాస్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.



ఏం జరిగిందో ఏమో ఆదివారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చనిపోయాడు. 
ఓ వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు భార్యలు సిగపట్లకు దిగారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎవరికి మృతదేహం అప్పగించాలో అర్థంకాక బిక్క మొహాలు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన హాట్‌ టాపిక్ అయ్యింది. పోలీసులు ఈ  ఘటనపై కేసు నమోదు చేసి పోస్ట్‌మార్ట్ నిర్వహించారు. మృతదేహాన్ని అప్పగించేందుకు కుటుంబ సభ్యులకు కబురు పంపారు.తర్వాత అసలు సినిమా మొదలైంది. పోలీసులకైతే చుక్కలు కానిపించాయనే చెప్పాలి. 



పవన్ కుమార్ డెడ్‌బాడీ కోసం ముందు ఐదుగురు మహిళలు వచ్చారు. మా ఆయన అంటే..కాదు మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. ఆయన తమ భర్తేనని తమకు అప్పగించాలని పోలీసుల్ని కోరారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే మరో ఇద్దరు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారు కూడా ఇదే వాదనను వినిపించారు. మొత్తం ఏడుగురు వచ్చి మృతదేహం కోసం కొట్లాటకు దిగారు. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులే కాదు స్థానికులు సైతం విస్మయానికి గురయ్యారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థంకాలేదు.. వారికి సర్థిచెప్పాలని చూసినా ఫలితం దక్కలేదు. పోలీసులు అందర్ని శాంతపరచడానికి కొద్దిగా సమయం పట్టింది. గొడవ కాస్త తగ్గిన తర్వాత అతడి అంత్యక్రియలు నిర్వహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: