అమ్మాయిలు అందంగా ఉండాలని చాలా రకాల పనులు చేస్తుంటారు.. అది కాక రసాయనాలు ఉన్న కాస్మొటిక్స్ వాడి చర్మాన్ని పాడుచేసుకుంటారు. అలాంటి వారు ఇంట్లో దొరికే నిమ్మతో చర్మానికి ఎంత మేలో అనే విషయాన్నీ మరిచిపోతారు. పుల్లగా ఉన్న నిమ్మతో అద్భుతమైన చర్మ రహస్యాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి నిమ్మతో మరేదైనా కలిపి తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. 


నిమ్మకాయ, తేనే : 

నిమ్మ చర్మాన్ని బ్లీచ్ చేస్తుంది.. తేనే చర్మానికి మృదుత్వాన్ని తీసుకొస్తుంది. అందుకే నిమ్మ చాలా మేలంటారు. 


నిమ్మకాయ, అలోవేరా :

అలోవెరా చర్మానికి మృదుత్వం తో పాటుగా చర్మంపై పేర్కొన్న జిడ్డును, మృతకణాలను తొలగిస్తుంది. నిమ్మ కాంతిని పెంపొందిస్తుంది. ఈ రెండింటిని కలిపి ముఖానికి రాసుకుంటే.. చర్మం నిగ నిగ లాడుతుంది. 


నిమ్మకాయ, బియ్యపు పిండి:

బియ్యపు పిండిలో, చిటికెడు పసుపు వేసుకొని, ఒకస్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకొని బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అంతే మెరిసే చర్మం మీసొంతం.. 


నిమ్మ, బ్రూ : 

బ్రూ చర్మానికి చాలా మేలు చేస్తుంది. నిమ్మను బ్రూ లో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతిని సంతరించుకుంటుంది. వారానికి రెండు సార్లు కనుక రాసుకుంటే మంచి మేలట. 
నిమ్మకాయ, చక్కర :
నిమ్మ రసం కొద్దిగా తీసుకొని అందులో కొద్దగా చక్కర వేసుకొని రెండింటిని బాగా కలుపుకొని ముఖానికి రాసుకోవాలి ఒక పది నిమిషాలు అయ్యాక కడిగేసుకోవాలి అంటే తెల్లటి చర్మం మీ సొంతం.. 
చూసారుగా పుల్లగా ఉన్న నిమ్మలో ఎన్ని చర్మ రహస్యాలున్నాయి.. మీరు వాడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: