విజయ దశమి అంటే అన్ని విజయాలు మనకు చేకూరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పండుగకు ముందు తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇకపోతే ఎంతో నిష్ఠగా పూజలు చేయడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరేలా అమ్మ అనుగ్రహం ఉందని ప్రజల నమ్మకం. 
ఈ పండుగకు రాష్ట్రము, దేశం తో సంబంధం లేకుండా అందరు చేసుకుంటారు. ఇకపోతే ఆ దేవి నవరాత్రులకు అమ్మకు ఇష్టమైన ప్రసాదాలను ఒక్కో విదంగా తయారు చేసి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా అమ్మకు ఇష్టమైన ప్రసాదం అంటే అటుకులతో చేసిన ప్రసాదం. ఈ అతుకుల ప్రసాదం ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాం.. 


 కావలసిన పదార్థాలు:

అటుకులు               : పావు కిలో 
బెల్లం                       : ఒక కప్పు 
చక్కర                      : ఒక కప్పు 
పాలు                       : అరలీటరు 
యలాచి పౌడర్           : కొద్దిగా 
డ్రై ఫ్రూట్ పౌడర్            : రెండు స్పూన్లు 
కొబ్బరి పొడి                 : ఒక స్పూన్ 
పచ్చ కర్పూరం             : కొద్దిగా 
నెయ్యి                        : రెండు స్పూన్లు 
కుంకుమ పువ్వు           : కొద్దిగా 


తయారీ విధానం : 

ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడి పెట్టుకోవాలి. అందులో పాలు వేసి బాగా మారగా నివ్వాలి. పాలు మరుగుతున్నప్పుడే కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఆ తరువాత అటుకులు, బెల్లం కూడా వేసుకొని మెత్తగా అయ్యేవరకు కలుపుకోవాలి. కొంచం అయ్యాక చక్కర కూడా వేసుకోవాలి. చక్కర ను కరిగించాలి. అందులో కొబ్బరి పొడి, యలాచి పొడి, పచ్చకర్పూరం వేసి బాగా కలపాలి. ఇంకా డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకొని బాగా కలపాలి. చివరగా పైన నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అమ్మవారికి ఇష్టమైన అటుకుల పాయసం రెడీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: