21వ శతాబ్దాంలోనూ భార్యను బానిసగా చూసే మధ్య యుగాల నాటి పోకడలు ఇంకా పోవడం లేదు. ఇప్పటికీ భార్య అంటే భర్త బానిసలాగానే చూస్తున్నారు చాలా చోట్ల. మరికొందరు మృగాళ్లు ఏకంగా పెళ్లాలకు నరకం చూపిస్తుంటారు.


చిన్న చిన్న విషయాలకే చేయి చేసుకుంటారు. అందరి ముందు పరువు తీస్తుంటారు. వారికో మనసు ఉంటుందన్న కనీస మానవత్వం కూడా ఉండదు ఆ దుర్మార్గులకు.. అలాంటి దుర్మార్గుడి కథే ఇది. ఈ మొగుడు ఏకంగా భార్యకు తానే స్వయంగా గుండు చేశాడు.


ఇంతకీ ఆ భార్య చేసిన తప్పేంటో తెలుసా.. చేసిన టిఫిన్లో వెంట్రుక పడటం.. అంతే.. కోపం తట్టుకోలేని భర్త భార్యకు గుండు కొట్టిన వికృత ఘటన బంగ్లాదేశ్ లో సంచలనంగా మారింది. బబ్లూ మొండల్ అనే వ్యక్తికి భార్య టిఫిన్ వడ్డించింది. అయితే ఆ టిఫిన్ లోపొరపాటున ఆమె వెంట్రుక పడింది.


కోపోద్రిక్తుడైన బబ్లూ ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు బ్లేడుతో గుండు చేశాడు. ఈ ఘటనపై అక్కడి మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గృహహింస నేరం కింద బబ్లూను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఎప్పుడు మారతారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: