బుల్లి తెరపై రేష్మి గౌతమ్, సుదీర్ ల లవ్ ట్రాక్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని పెళ్లి కి కూడా రెడీ అని పలుమార్లు వినిపించగా అవి ఇప్పటి వరకు నిజం కాలేదు. అయితే ఇపుడు రేష్మి ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి సుదీర్ తో ప్రేమ అనేది కేవలం స్క్రీన్ పైనే తప్ప నిజన కాదని, కాగా ఇపుడు ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో రేష్మి గౌతం పెళ్లి కుదిరింది అని ఇప్పటికే నిశ్చితార్థానికి ముహూర్తం కూడా రెడీ అని, వచ్చే ఏడాది లో పెళ్లి అని పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ముందుగా సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన రేష్మి గౌతం ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం తో జబర్దస్త్ లో అవకాశం రావడంతో బుల్లితెరపై మెరిసింది. అయితే ఎవరు ఊహించని రీతిలో ఈ అమ్మడు బులోతెరపై బిగ్ సెలబ్రెటీలా మారిపోయింది. ఒక్కసారిగా ఈమె పాపులారిటీ, రెమ్యునరేషన్ అంతా పెరిగాయి. ఆ తరవాత వెండి తెరపై కూడా అడపాదడపా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది రష్మి. ముఖ్యంగా టెలివిజన్ షోలో ఈమెకి అంతగా క్రేజ్  పెరగడానికి కారణం జబర్దస్త్ సుదీర్ అనే చెప్పాలి. వీరి మధ్య ఏదో ఉంది అన్నట్లుగా స్క్రీన్ పై వీరి మద్య చాలా మ్యూజిక్ లే వినిపించాయి. మ్యాజిక్ లు కనిపించాయి. దాంతో వీరి మద్య కేమెస్త్రికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని ఎన్నో వార్తలు వినిపించగా అంతా ఇది నిజమే అనుకున్నారు. అయితే ఇటీవల సుదీర్ జబర్దస్త్ లో కనిపించక పోవడంతో వీరి పెళ్లి విషయం గురించి కూడా వార్తలు తగ్గాయి. అయితే ఇపుడు అనూహ్యంగా 2023 లో రేష్మి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు అన్న వార్తలు జోరుగా చెలరేగుతున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రేష్మి స్పందిస్తే తప్ప తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: