Rating 3 / 5

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే మళ్లీ ఓ ప్రేమకథతో వస్తారేమో అనుకుంటే ఈసారి పుష్ప అంటూ చాలా పెద్ద కథతోనే వచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

ఒక అణగారిన కుటుంబానికి చెందిన హీరో పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన ధైర్యంతో తనకు వచ్చిన ప్రతి అడ్డంకులను దాటుకుంటూ వెళ్తాడు. సాధారణ కూలీగా శేషాచలం అడవుల్లో పనిచేసే పుష్ప రాజ్ సాండిల్ వుడ్ సిండికేట్ లీడర్ గా ఎలా మారాడు అన్నది సినిమా కథ.  

నటీనటుల ప్రతిభ :

పుష్ప రాజ్ పాత్ర చేసిన అల్లు అర్జున్ కు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి. స్టార్ హీరోగా ఇప్పటికే ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోశించిన బన్నీ కెరియర్ లో మొదటిసారి చాలా బలమైన పాత్ర చేశాడని చెప్పొచ్చు. అల్లు అర్జున్ ఇన్నేళ్ల నట విశ్వరూపం అంతా పుష్ప రాజ్ పాత్రలో చూపించాడు అల్లు అర్జున్. క్యారక్టర్ చేయడం అంటే ఏదో డైరక్టర్ చెప్పింది చేయడం కాదు. ఆ పాత్ర పట్ల అంకితభావం.. దర్శకుడి తన మీద పెట్టుకున్న నమ్మకం ఇవన్ని దృష్టిలో పెట్టుకుని బన్నీ ఈ పుష్ప పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోయిన్ రష్మిక కూడా ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయని డీ గ్లామరస్ రోల్ లో నటించి మెప్పించింది. అల్లు అర్జున్ రష్మిక జోడీ ఆకట్టుకుంది. ఇక కొండా రెడ్డి పాత్రలో అజయ్ ఘోష్ అతని బ్రదర్స్ ఓకే అనిపించారు. మంగళం శ్రీనుగా సునీల్ ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు. రావి రమేష్ పాత్ర ఈ భాగంలో తక్కువే ఉంది. ఇక పార్ట్ 1 లో ఎస్పీ భన్వీర్ సింగ్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశాడు మళయాళ స్టార్ ఫహద్ ఫాజిల్. తన పాత్ర అసలు విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటుందని అర్ధమయ్యేలా ఈ పార్ట్ లో శాంపిల్ చూపించారు. పుష్ప రాజ్ అసిస్టెంట్ గా చేసిన కేశవ పాత్రదారుడి అభినయం మెప్పించింది. చాలా నేచురల్ గా అతని నటన ఆకట్టుకుంది.

సాంకేతిక విభాగం :

సుకుమార్ చెప్పాలనుకున్న కథను బాగా చెప్పాడు. సుకుమార్ అనగానే క్లాస్ డైరక్టర్ అన్న టాక్ ఉండేది. కాని ఈ సినిమాతో అతను ఊర మాస్ సినిమాలను కూడా తీయగలడు అని ప్రూవ్ చేశాడు. ఎంచుకున్న కథ.. నడిపించిన కథనం అంతా చాలా క్లారిటీగా తీసుకెళ్లాడు.

ఓ పక్క హీరో పాత్రకి ఇంటి పేరు అంటూ సెంటిమెంట్ ను యాడ్ చేస్తూ మరో పక్క తన ఎటాకింగ్ క్యారక్టరైజేషన్ ను బాగా ఎలివేట్ చేశాడు డైరక్టర్. అయితే అక్కడక్కడ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. సినిమా కథ కొద్దిగా కె.జి.ఎఫ్ తరహాలో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగానే అనిపించినా కొన్ని సీన్స్ మాత్రం పెద్దగా మెప్పించలేదు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవి  మ్యూజిక్ నిజంగానే అద్భుతం చేసింది. బిజిఎం విషయంలో డబుల్ డోస్ అందించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు. సుకుమార్ రాసుకున్న కథను తెరరూపం దాల్చడంలో నిర్మాతల సపోర్ట్ కనిపిస్తుంది. పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపించేలా చేశాడు సుకుమార్.  
 
విశ్లేషణ :

అణగారిన కుటుమ్న నేపథ్యం నుడి వచ్చిన ఓ వ్యక్తి కథ పుష్ప. ఈ సినిమా కథను ఆడియెన్స్ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. మాస్ హీరో ఎలివేషన్, మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, కామెడీ సీన్స్, భారీ యాక్షన్స్ సీన్స్ ఇవన్ని పుష్పకి పాజిటివ్ అంశాలని చెప్పొచ్చు.

సాండిల్ వుడ్ సిండికేషన్.. అసలు ఈ స్మగ్లింగ్ ఎక్కడ నుండి ఎక్కడకు జరుగుతుంది అన్న విషయాలని చాలా క్లియర్ గా ప్రస్థావించారు సుకుమార్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్ గా అనిపించగా సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ పార్ట్ కోసం లీడ్ తీసుకున్న విధానం బాగానే అనిపించినా సినిమా లెంగ్ దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ మీద ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది అనిపిస్తుంది.  

బాటమ్ లైన్:

అల్లు అర్జున్ కోసం వెళ్ళండి - అల్లు అర్జున్‌ని ఆశించవద్దు.


9:30 AM: పుష్ప : ది రైజ్ - పార్ట్ 01 తెలుగు మూవీ రివ్యూ, Indiaherald.com రేటింగ్

కథ: ఒక అణగారిన కుటుంబానికి చెందిన కుర్రాడు తన తెలివి ధైర్యంతో  జీవితంలో ఎలా ఎదగాలి అనుకున్నాడు.. ఇక ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు  అన్నదే పుష్ప కథా కథాంశం యొక్క ప్రధానాంశం అనీ చెప్పాలి. ఇక ఈ సినిమాలో మిగతాదంతా క్రిస్మస్ చెట్టుకు గంటలు, ఈలలు కట్టినట్లు ఉంటుందట.పుష్ప కథాంశం ప్రధానాంశంగా కేజీఎఫ్‌ సినిమా కథాంశం లాగే సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతాడట.

9:22 AM: పుష్ప రివ్యూ: క్లైమాక్స్‌లో భన్వర్ సింగ్ శిఖావత్ , పుష్ప  రాజ్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులకు కాస్త  ల్యాగ్‌గా అయ్యిందేమో అనిపిస్తుందట… సుకుమార్  తీసే ప్రతి సీన్ కి ఒక లెక్క ఉంటుంది.. మరి లెక్కల మాస్టర్  లెక్కలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..

9:12 AM: పుష్ప రివ్యూ : పార్ట్ 2 కోసం ప్రతి ప్రేక్షకుడిలో మరింత ఆసక్తి పెరిగేలా బేస్ సెట్ చేయడానికి విలన్ ను మరింతగా చివర్లో హైలెట్ చేస్తూ ఉన్నారు..

9:04 AM: పుష్ప సమీక్ష: పాత విరోధుల పోయారు.. కొత్త శత్రువులు తెర మీదికి వచ్చారు… ఉన్న పోలీస్ అధికారిని వెళ్ళిపోగా.. కొత్త అధికారులు ఎంట్రీ ఇచ్చారు… తల్లి సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది

8:58 AM: పుష్ప రివ్యూ: ఫెరోసియస్ మ్యూజిక్ ఈ సినిమాలో కనిపిస్తుంది. అమేజింగ్ వాయిస్ కల్చర్అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఎంతో  మంది జూనియర్ ఆర్టిస్టులు పుష్పాలో కనిపిస్తారు.. పుష్ప రాజ్ సందడి మామూలుగా ఉండదు

8:48 AM: పుష్ప రివ్యూ: మాములుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడేటప్పుడు మణిశర్మ గురించి ఎక్కువగా మాట్లాడుతాము... కానీ ఇకపై కాదు... పుష్ప కోసం DSP BGM మీరు ఊహించగలిగేది కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యూజిక్ ను ఆస్వాదించేలా BGM వుంది. పుష్ప కోసం DSP BGM ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది.ఇది సినిమాను టాప్ లో ఉంచుతుంది.

8:43 AM: పుష్ప రివ్యూ : రెండు స్మగ్లర్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణ యాక్షన్ కొరియోగ్రఫీ మీరు ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలోనూ చూసి ఉండరు .

8:39 AM: పుష్ప తెలుగు మూవీ రివ్యూ, ఇండియా హెరాల్డ్ ద్వారా రేటింగ్ పుష్ప గురించి నిజాయితీగా ప్రత్యేకమైన సినిమాలోని అసలు విషయాలను అందిస్తున్నాము. ది రైజ్ - పార్ట్ 01.ఈ సినిమా గురించి ఎంతోమంది ప్రేక్షకుల అభిప్రాయాలను  సేకరించి రివ్యూ అందజెస్తున్నాము. మా పాఠకులందరికీ ఇండియా హెరాల్డ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన దేశంలోని సామాన్యులకు వినోదాన్ని అందించే  సినిమాని మేము గౌరవిస్తాము. మా ప్రయత్నమంతా నిష్పక్షపాతంగా మీకు ఉత్తమమైన సినిమా రివ్యూ లను  అందించడమే, మీ ఆదరనకు ప్రతి పాఠకుడికి, సినీ ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు...


8:33 AM: పుష్ప రివ్యూ: టన్నుల కొద్దీ జూనియర్ ఆర్టిస్టులు, పెప్పీ మ్యూజిక్, రష్మిక మ్యాజిక్, శేఖర్ అందించిన సామి పాట బాగానే ఉంది… ఈ సాంగ్ లిరికల్ వీడియో వెర్షన్ విజువల్ కంటే అద్బుతంగా ఉంది.

8:27 AM:పుష్ప రివ్యూ : చమత్కారం, అమాయకత్వం, లోతైన భావోద్వేగాలు, జీవితకాలపు నటన, ఎలాంటి మేకప్ లేకుండా కూడా తెరపై దివాలా కనిపించడం... ఇండియా హెరాల్డ్ రేటింగ్‌లో పుష్ప తెలుగు మూవీ రివ్యూకు రష్మిక అసెట్‌గా నిలిచింది.

8:22 AM: పుష్ప రివ్యూ: బ్రిలియంట్ యాక్షన్ సీక్వెన్స్, ఎప్పుడూ ఊహించని BGM, యాక్షన్ కొరియోగ్రఫీ,ఇటువంటి యాక్షన్ సన్నీవేశాలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అత్యంత అర్థవంతమైన ఇంకా రా సీక్వెన్స్‌లో పుష్ప ఒకటి..

8:19 AM: పుష్ప రివ్యూ: విక్రమ్ పెర్ఫార్మెన్స్  చూసి.. టాలీవుడ్‌లో అలాంటి నటుడు మనకు ఎందుకు లేడు అని ఆలోచించే వాళ్లకి... ఇదిగో మీ సమాధానం నేనే అంటూ అల్లు అర్జున్ తన నటనతో చెప్పకనే చెప్పాడు. మెగా కాంపౌండ్ హీరోగా మాత్రమే కాదు... నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన అసలు సిసలైన హీరో అని నిరూపించాడు.

8:18 AM:పుష్ప రివ్యూ: టాలీవుడ్లో తనదైన మ్యాథ్స్  లెక్చరర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఇక పుష్ప సినిమాలో మరింత ఖచ్చితంగా కమర్షియల్ మాస్ సినిమా కోసం అన్ని డోస్‌లను జోడించాడు అని చెప్పాలి.

8:10 AM: పుష్ప రివ్యూ : పుష్ప వినోదభరితంగా ఉంది.  విభిన్నమైన సినిమాని, సినిమాలోని కొత్తదనాన్ని సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు అనీ చెప్పాలి.

8:04 AM:పుష్ప రివ్యూ: అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ఇప్పటివరకు ప్రతి సీన్లో అల్లుఅర్జునే కనిపిస్తాడు.. ఇప్పటివరకు చూసిన అల్లు అర్జున్ కాదు.. ఈ సినిమాలో పూర్తిగా కొత్త అల్లు అర్జున్‌ని ప్రేక్షకుడు చూసి నటనను ఆస్వాదిస్తాడు.. పుష్ప ఫలితం ఎలా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తన నటనతో మరింత స్టార్డమ్ సంపాదిస్తాడు అనే చెప్పాలి..

8:01 AM:పుష్ప రివ్యూ : మంగళం శీను..  చడ్డీ ధరించడం నుండి తన ముఖకవళికలను హావభావాల వరకు తన ఎఫర్ట్ మొత్తం పెట్టాడు. తనకు చేతనైనదంతా ఇచ్చాడు. ఇండియా హెరాల్డ్ ద్వారా  సుకుమార్ మరియు అల్లు అర్జున్‌ల పుష్ప రివ్యూలో సినిమాపై సునీల్ అభిరుచి మరింతగా కనిపిస్తుంది అని చెప్పాలి.

7:58 AM: పుష్ప రివ్యూ: శ్రీవల్లి పాత్ర తెరపై ఎంతో ఆనందంగా సాగిపోతూ  ఉంటుంది... రష్మిక శ్రీవల్లి పాత్రలో  అద్భుతమైన నటన పరిణితి ప్రదర్శించింది... ఇక ఈ సినిమాలో రష్మిక నటన చూస్తే.. టాలీవుడ్ మరియు సౌత్ సినీ పరిశ్రమలో రష్మికలో మరో సౌందర్య ఉందేమో అని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.

7:53 AM:పుష్ప రివ్యూ: హీరో ఎలివేషన్ ప్రతి సీన్లో కొనసాగుతూనే ఉంది … టాలీవుడ్‌లోని  ప్రముఖ నటులు అందరు ఈ సినిమాలోని పాత్రలలో అద్భుతంగా నటించి వారి నట విశ్వరూపాన్ని చూపించారు  .

7:46 AM: pushpa review : pushpa Dialogues కొండపైన శ్రీనువాసులైనా.. కొండకింద మంగళం శీనైనా తగ్గేదేలే

7:43 AM: పుష్ప రివ్యూ: పుష్ప సినిమా  కెజిఎఫ్‌ని  గుర్తుచేస్తుంది. ఎందుకంటే అచ్చం కేజిఎఫ్ సినిమాలో లాగే  హీరో ఆటిట్యూడ్‌ మరియు మదర్ సెంటిమెంట్  ట్రాక్‌ .. పేదరికం ఈ సినిమాలో కనిపిస్తాయి. కేజిఎఫ్ సినిమాలో లాగే ఇక్కడ హీరో పాత్రలో  తెలివి & సంకల్పం కనిపిస్తూ ఉంటాయి.

7:41 AM: పుష్ప రివ్యూ: స్మగ్లింగ్, పేదరికం, మదర్ సెంటిమెంట్, రాజకీయ నాయకుల ప్రవేశం, లవ్ ట్రాక్, హీరో చేసిన కామెడీ చాలా వరకు పుష్పకు హైలెట్ అవుతున్నాయి.

7:38 AM: పుష్ప రివ్యూ: ఊ అంటావా ఉహూ అంటావా  మొదలై సమంతా కనిపించిందో లేదో  థియేటర్ మొత్తం ఈలలు గోలతో  హోరెత్తుతోంది... అయినా సమంత క్రేజ్ కి  ఈ పాట అదనం కాదు.

7:33 AM: పుష్ప రివ్యూ : ఐటెం గర్ల్‌గా సమంత ఒకప్పటి ఐటమ్ గర్ల్‌ జ్వాలా గుత్తాను గుర్తు చేస్తుంది. అయితే సమంత కావల్సిన దానికంటే కాస్త అతి చేసినట్లు అనిపిస్తుంది.

7:32 AM: పుష్ప రివ్యూ: దర్శకుడు సుకుమార్ ఈ మొత్తం గంట సమయంలో టాలీవుడ్‌కి కొత్త RGV అని చెప్పకనే చెప్పారు, ఇక ట్రైలర్‌లు, టీజర్‌లు లేదా పాటల విడుదలలలో చూపబడిన ఉత్తమ విజువల్స్ ఇప్పటికే కనిపించాయి.

7:30 AM: pushpa review : pushpa Dialogues పుష్ప ఉంటే సరుకుండదు - సరుకుంటే పుష్ప ఉండడు

7:29 AM: పుష్ప రివ్యూ: మొత్తం స్మగ్లింగ్ ట్రాక్‌ను స్థాపించడానికి వీరప్పన్‌ను స్టైల్ ఉపయోగించారు… అయితే ఇవన్నీ ఇప్పటికే ఎన్నో సినిమాలలో చూపించారు అన్న విషయం అందరికీ తెలుసు.

7:26 AM: పుష్ప రివ్యూ : అల్లు అర్జున్ పుష్ప పాత్రలో ఒక స్టైలిష్ స్టార్ స్టైలిష్ స్టార్ ఎక్కడా కనిపించడు. తన ఇమేజ్‌ని పణం గా పెట్టి ఈ పాత్రను చేశాడు అల్లు అర్జున్. ఇప్పటివరకు  అల్లు అర్జున్ తన కెరీర్ మొత్తంలో తన మొత్తం ఇమేజ్‌ను పణంగా పెట్టి చేసినందుకు అల్లు అర్జున్ ప్రయత్నాలను అభినందించాల్సిందే.

7:24 AM: పుష్ప రివ్యూ: పుష్ప పాత్ర యొక్క క్యారెక్టరైజేషన్  రా మరియు రఫ్ ఉంటుంది.. ఈ సినిమా చూస్తుంటే అటు దండుపాళ్యం క్యారెక్టరైజేషన్ కూడా గుర్తుకొస్తుంది.

7:17 AM: పుష్ప రివ్యూ: మంగళం శీను ఎంట్రీ అంత  బాగా కుదరలేదు. సునీల్ పుష్ప సినిమాలో కాకుండా  అనకొండ సినిమాలో ఉన్నట్లుగా కనిపించాడు.

7:15 AM: పుష్ప తెలుగు మూవీ రివ్యూ, ఇండియా హెరాల్డ్ రేటింగ్: హీరోయిన్ పాత్ర హైలెట్ ..అలాగే హీరో,హీరోయిన్ ల మధ్య జరిగే లవ్ సీన్స్, శ్రీవళ్లి తో వచ్చే సన్నీవేశాలు బాగున్నాయి.


7:08 AM: పుష్ప రివ్యూ: గంధపు చెక్కల స్మగ్లింగ్, కొండా రెడ్డి బ్రదర్స్ మొదటి స్మగ్లర్లు, పుష్ప మదర్ సెంటిమెంట్, స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీసు అధికారిగా గోవిందప్ప, ప్రేమించిన శ్రీవల్లి ..సినిమా మొత్తం ఇదే..

7:05 AM: పుష్ప సమీక్ష: ట్రేడ్‌మార్క్ డైలాగ్ తగ్గేదెలే అనేకసార్లు వాడారు..అది అంతగా సందర్భానికి సెట్ అవ్వలేదని తెలుస్తుంది.

7:03 AM: పుష్ప రివ్యూ: దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యింది.

7:01 AM: pushpa review : pushpa Dialogues లచ్చలు తీసుకున్నా కూలోళ్ళమే .. అదే 4% తీస్కుంటే ఓనర్లమవలా ?

6:58 AM: పుష్ప రివ్యూ: దాక్కో దాక్కో మేక పాట వచ్చి వెళ్లిపోయింది.. బయట భారీగా హిట్టవుతుండగా.. అసలు పాట చూడటానికి కంటే లిరికల్ సాంగ్ విజువల్స్ చాలా బాగున్నాయి..

6:55 AM: పుష్ప రివ్యూ: కొండా రెడ్డి బ్రదర్స్ మొదటి సెట్ విరోధులు విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డారు. సినిమాకు వారు తమ వంతు కృషి చేశారు.

6:53 AM: పుష్ప తెలుగు మూవీ రివ్యూ: అన్ని హైప్ మరియు స్థాపన పుష్పరాజ్ పాత్ర చాలా వరకు చిత్రానికి సహాయపడినట్లు అనిపిస్తుంది… ఇంతవరకు అటువంటి ఏర్పాటు లేకుండా స్టైలిష్ స్టార్ అభిమానులు స్టైలిష్ స్టార్ అభిమానులు అంగీకరించలేరు… అన్ని సమయాలలో మహమ్మారికి ధన్యవాదాలు సినిమా చాలా దూరం వచ్చింది.

6:50 AM: పుష్పా రెవ్: 19 నిమిషాల ఈ స్వల్ప వ్యవధిలో అందించిన అనేక పాత్రలు.. సినిమా పూర్తిగా పవర్ ప్యాక్డ్ పాత్రలను ప్రదర్శించబోతోందని సూచిస్తుంది.

6:49 AM : పుష్ప రివ్యూ : పుష్ప , పుష్ప రాజు .. ఇప్పటి వరకు వచ్చిన భారీ ట్రాక్ కేవలం సెకండ్ స్ప్లిట్ లోనే భారీ మదర్ సెంటిమెంట్ గా మారిపోయింది .

ఇంటిపేరు ఆ తేడాను తెచ్చిపెట్టింది మరియు అంత వేగంగా రష్ నుండి భారీ సెంటిమెంట్ వరకు అవసరమైన ఎమోషనల్ డోస్ ఇచ్చారు.

6:45 AM: పుష్ప రివ్యూ: సినిమా పరిచయం భారీ హడావిడితో ల్యాండ్ అయింది మరియు షాట్‌ల సీరియస్ సీక్వెన్స్ కొనసాగింది .. మీరు మీ కళ్ళు తెరపై నుండి తీయలేరు ...అంత గొప్ప సీన్స్ కనిపిస్తాయి.

6:42 AM పుష్ప రివ్యూ: ఎర్రచందనం స్మగ్లింగ్‌ని రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేయడం ద్వారా దర్శకుడు సుకుమార్ తెలివితేటలు అంతటా చర్చనీయాంశమయ్యాయి. .

6:38 AM : పుష్ప తెలుగు మూవీ రివ్యూ, ఇండియా హెరాల్డ్ రేటింగ్: స్క్రీన్‌పై విజువల్స్ చాలా వరకు చీకటి కాంతిలో చిత్రీకరించబడ్డాయి.

6:38 AM : పుష్ప రివ్యూ : పుష్ప రాజ్ తన యాటిట్యూడ్, ప్రెజెన్స్ మరియు మ్యానరిజమ్‌తో టై స్క్రీన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.. అల్లు అర్జున్ అభిమానులు థియేటర్‌లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు..


పుష్ప రివ్య:, రేటింగ్ బై ఇండియా హెరాల్డ్: కరోనా, డెల్టా, ఒమిక్రాన్ మొత్తం మహమ్మారి మాస్ సినిమా అనే కాన్సెప్ట్‌ను ప్రమాదంలో పడేసేలా ప్రయత్నించింది.. అలాంటి వాటన్నింటికి మర్చిపోయెలా చేస్తుంది. సినీ జనాల ఉద్వేగభరితమైన స్పందనతో సినిమాకి మంచి రేటింగ్ ను ఇస్తుంది. సినిమా ఇంకా అభివృద్ధి జరుగుతోంది రాబోయే కొన్ని తరాలు ఇక్కడే ఉండాలి. దాదాపు 2 సంవత్సరాల భారీ గ్యాప్ తర్వాత శంకుస్థాపన చేసేవారు పెద్ద సంఖ్యలో థియేటర్లలోకి వచ్చారు... హైదరాబాదీల్లో రెండంకెల % కంటే ఎక్కువ మంది పుష్ప : ది రైజ్ - పార్ట్ 01ని ఈ మొదటి రోజునే చూస్తారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వినోదం కోసం ఏమీ చేయలేని భారతదేశం వంటి దేశంలో... సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం.Pushpa: The Rise is the most awaited film of 2021. Brilliant director Sukumar, stylish star allu arjun, silver screen Nia Dia rashmika mandanna, Ton more most elegant performers of top stature came together for this visual wonder pushpa : The Rise.

Pushpa: The Rise / Part - 01 orchestrated to be a PAN india movie.. has made big before the release itself. While pushpa telugu movie review, Rating will be out for the audience across the world on 17th december 2021.. all the 5 songs of the movie in all 5 languages the movie is being released are making top charts and trending relentlessly.

Pushpa telugu movie review, Rating revolves around the core plot of a common man from the oppression raising to the heights through the ways and means he found.

Pushpa telugu movie review, Rating by india Herald brings you exclusive insights, perspective of the movie  Pushpa : The Rise 2021. Stay tuned for the first pushpa review online.

 

BANNER : Mythri movie Makers
PRODUCTIONS : Y naveen and Y ravi Shankar

CAST & CREW : allu arjun, rashmika mandanna, Fahadh Faasil, Vijay Sethupathi, Prakash Raj, Jagapati Babu, vennela Kishore, anasuya Bharadwaj, Anish Kuruvilla

COMPOSER(S): Devi Sri Prasad
DIRECTOR(S) : Sukumar


మరింత సమాచారం తెలుసుకోండి: