BMW లగ్జరీ కార్లకి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ నుంచి అదిరిపోయే మోడల్ 6-సిరీస్ జీటీ ఫేస్ లిఫ్ట్ విడుదల అయ్యి ఎంతగానో ఆకట్టుకుంటుంది.దీనిలో రివర్స్ అసిస్ట్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, 10.25 అంగళాల రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, 360 డిగ్రీల పార్కింగ్ కెమేరా, నాలుగు జోన్ల క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ బెల్టులు, పానోరామిక్ సన్ రూఫ్, ఎయిర్ సస్పెన్షన్, డోర్లు లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

కండీషన్డ్ బేస్డ్ సర్వీస్ కింద 3 ఏళ్ల పాటు లేదా 40 వేల కిలోమీటర్ల వరకు గ్యారంటీనిస్తుంది బీఎండబ్ల్యూ. మెయింటనెన్స్ కింద 10 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటినిచ్చింది.మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. పెట్రోల్ మోడల్ వచ్చేసి బేస్ వేరియంట్. డీజిల్ ఇంజిన్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవే లగ్జరీ లైన్, ఎం స్పోర్ట్ వేరియంట్లు. వీటి ధర వచ్చేసి వరుసగా రూ.68.90 లక్షలు, 77.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. టాంజానైట్ బ్లూ మెటాలిక్, ఫైటోనిక్ బ్లూ మెటాలిక్, పేమోంట్ రెడ్ మెటాలిక్, బెర్నియా గ్రే యాంబర్ ఎఫెక్ట్ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు.

ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.67.90 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఇందులో బీఎండబ్ల్యూ డిస్ ప్లే కీ, హెడ్ ఫోన్లు, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.ఇక ఈ కారు అతిపెద్ద గ్రిల్, లేజర్ టెక్నాలజీతో కూడిన సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్-ఆకారపు ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ బంపర్లు, ట్రేపిజోడియల్ ఎక్సాహాస్ట్ టిప్స్ లాంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇవి కాకుండా ఈ సరికొత్త సెడాన్ లో 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తూడా కూడి లేటెస్ట్ ఐటరేషన్ కనెక్టడ్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.2.0-లీటర్ నాలుగు సిలీండర్ల టర్బోఛార్జెడ్ ఇంజిన్ 5000ఆర్పీఎం వద్ద 257 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 1550 ఆర్పీఎం నుంచి 4400 ఆర్పీఎం మధ్య 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

దీని డీజిల్ ఇంజిన్ అయితే 620డీ లగ్జరీ 2.0-లీటర్ టర్బోఛార్జెడ్ యూనిట్ ను కలిగి ఉండి 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 400 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పెక్ 3.0-లీటర్ డీజిల్  టర్బో ఛార్జెడ్ యూనిట్ ను కలిగి ఉండి 236 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 620 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 8-స్పీడ్ స్టెప్ ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: