మారుతి సుజుకికి చెందిన వాహనం అత్యధిక అమ్ముడైన కారుగా నిలిచింది. కోవిడ్-19 సంక్షోభంలో కూడా మారుతి స్విప్ట్ టాప్ బ్రాండ్‌గా ఖ్యాతి దక్కించుకుంది. 2020 ఏడాదిలో లక్షా అరవై వేలకుపైగా విక్రయాలతో ఈ రికార్డు సాధించింది. టెక్ సావీ ఫీచర్లు, సరియైన ధర, స్పోర్టి డిజైన్లతో యువతరం మనుసు దోచుకుందని కంపెనీ వెల్లడించింది. స్విఫ్ట్ కస్టమర్లలో 53 శాతానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది కూడా అలాంటి కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. యువతను ఆకట్టుకునే విధంగా మున్ముందు వచ్చే కార్లను అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ ఎండీ తెలిపారు.