టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' మోడల్లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 'ఆల్ట్రోజ్ ఐ-టర్బో' పేరుతో తీసుకొచ్చిన ఈ కారులో శక్తి వంతమైన ఇంజిన్‌తో పాటు కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి అత్యాఆధునిక ఫీచర్లను పొందుపర్చింది. అంతేకాదు..ఎక్స్‌టీ, ఎక్స్జెడ్, ఎక్స్జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుందని టాటా మోటర్స్ వెల్లడించింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధరను రూ.8.26 లక్షలుగా వెల్లడించింది.