ఆటో మొబైల్ కంపెనీలలో టాప్ కార్లలో ఒకటి టాటా.. ఈ కారుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో కారుకు ఒక్కో రేంజ్ చరిత్ర ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కారుకు డిమాండ్ భారీగా పెరిగింది. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ మరోసారి అదిరిపోయే ఆఫర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అదేంటంటే.. టాటా మోటార్స్ జాతీయ విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్ టియాగో మోడల్ కారును శనివారం ఆవిష్కరించింది. ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ధర రూ.5.79 లక్షలకు వినియోగదారులకు లభ్యం అవుతుంది.