ఆటో మొబైల్ కంపెనీలు ఎప్పుడూ ఏదోక కొత్త మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని కార్లు ఏడాది మొదట్లోనే భారీ సేల్స్ ను అందుకున్నాయి.. కరోనా భయంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ప్రజలు పర్సనల్ మొబిలిటీకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొన్ని నెలలుగా కార్ల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతున్నది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ కార్ల విక్రయాల్లో గ్రోత్ కొనసాగుతూ వచ్చింది. భారతదేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాల్లో 8.3 శాతం గ్రోత్ నమోదైంది. గత ఫిబ్రవరిలో 1,44,761 యూనిట్లు అమ్ముడు పోగా, గతేడాది 1,33,702 కార్లు మాత్రమే సెల్ అయ్యాయి.