హోండా సంస్థ తన సరికొత్త మోడల్ ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ350 ఆర్ఎస్. మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్ లో భాగంగా విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఎక్స్ షోరూంలో హోండా సీబీ350 ఆర్ఎస్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.96 లక్షలు. అగ్రెసివ్ డిజైన్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ అధునాతన స్టైల్ తో తెగ ఆకట్టుకుంటుంది. సీబీ 350 ఆర్ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉండి Y- ఆకారపు అల్లాయ్ వీల్స్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా వృత్తాకారపు ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, నేత్రాకరపు ఎల్ఈడీ వింకర్లత, అండర్ సీట్ స్లీక్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్ స్టర్ లుక్ తో మార్కెట్ లోకి హవాను కొనసాగిస్తోంది.