సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్‌ను సరికొత్త రైడ్ మోడ్స్ తో విడుదల చేసింది.. 4V ఈ బైక్ లో స్పోర్ట్స్, అర్బన్ రెయిన్ అనే 3 రైడ్ మోడ్స్ ను అందిస్తోంది. అర్బన్ మోడ్ రోజువారీ రైడ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అర్బన్ మోడ్ ఇంజన్ నుండి గరిష్ట పవర్ ను గ్రహించి వెంటనే రెస్పాండ్ అయ్యే ల ఈ మోడ్ ను డిజైన్ చేశారు.రెయిన్ మోడ్ లో స్ట్రాంగ్ లివర్ పల్సేషన్ అందించేందుకు ఏబీఎస్ నుండి గరిష్ట స్పందనను పొందుతుంది. తడిగా ఉన్న రహదారులపై ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ మోడ్ ట్రాక్, హైవేల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.