హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ హీరో ఎలెక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,540. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఇందులో ఆప్టిమా హెచ్ ఎక్స్, నిక్స్ హెచ్ ఎక్స్, ఫోటాన్ హెచ్ ఎక్స్ అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉన్నాయి. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా వీటిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది..