మనిషి శరీరంలో ఎన్నో సున్నతమైన అవయవాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖంపై చాలా సున్నితమైన ప్రదేశాలు.. కళ్లు,ముక్కు,పెదవులు,నాలుక,చిగుళ్లు ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. సాదారణంగా చాలా మందికి కంటి కింద నలుపు చాయ ఏర్పడుతుంది. అయితే ఇది ఎక్కువ నిద్ర లేమి ఉన్నవారికి, పని ఒత్తిడి, కళ్ళకు విపరీతమైన శ్రమకు గురిచేసే వారి కంటికింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. అంతే కాదు కంటికి ఉపశమనం కోసం కొన్ని క్రీమ్ లు రాసుకోవడం వల్ల కూడా నల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. తద్వారా అందంగా వుండే ముఖచర్మం ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోతుంది. అంతేకాదు.. అనారోగ్యంగా వున్నట్లు కనిపిస్తారు. అయితే వీటిని ఎంత వీలైతే అంత త్వరగా వీటిని నిర్మూలించేందుకు ప్రయత్నించాలి. 

 ఇందుకోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.


ఒక పాత్ర తీసుకుని అందులో కీరా రసం, బంగాళదుంప రసాలను సమపాళ్లలో వేసుకుని, బాగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, 20 నిమిషాలపాలు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా, చాలా జాగ్రత్తగా కడిగేసుకోవాలి. బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్‌ను కళ్లకింద అప్లై చేయాలి. ఒక చుక్క నీటిని అద్ది రాయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు.  


బంగాళదుంపను పేస్ట్ గా చేసుకుని ముఖానికి ప్యాక్ లా పట్టించాలి. కొద్దిసేపు అలాగే వుంచుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటికింద నల్లని వలయాలు పూర్తిగా తొలగిపోవడంతోపాటు చర్మసౌందర్యం మెరుగవుతుంది. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు సైతం దూరమవుతాయి.


అవొకాడో కూడా కంటికింద నల్లటి వలయాలను నిర్మూలించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి తగిన పోషణను, తేమను అందిస్తుంది. అంతే కాదు చర్మ ప్రకాశవంతంగా మారడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి ఒక ఉత్తమ డైట్ వంటిది. అవొకాడో పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మసౌందర్యం మెరుగై, వలయాలు నిర్మూలించబడతాయి.  


ఆలూ నుంచి తీసిన రసాన్ని ముఖానికి పట్టిస్తే కంటిచుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తొలగిపోతాయి.  బంగాళాదుంపల్ని చిన్న ముక్కలుగా కోసుకుని మొహానికి అప్లై చేస్తూంటే చర్మపు ముడతలు తొలగిపోతాయి. చర్మంపై మృతకణాలను ఇది తొలగిస్తుంది.


నిమ్మ రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. స్కిన్ రాషెస్, బ్లాక్ హెడ్స్‌ను నివారిస్తుంది. నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి ఒక భాగం తీసుకొనే ముఖం మొత్తాన్ని మర్దన చేయాలి. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, కంటికంద నల్లటి వలయాలు పూర్తిగా నిర్మూలించబడి, మెరుగైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: