స‌హ‌జంగా చాలా మంది మ‌హిళ‌ల‌కు డెల‌వ‌రీ త‌ర్వాత చాలా ర‌కాల స‌మ‌స్య‌లతో ఇబ్బందిపడ‌తారు. అందులో ఈ స్ట్రెచ్ మార్క్స్ కూడా ఒక‌టి. అయితే ప్రెగ్నెన్సీ వల్ల పొట్ట‌ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా ఉండాలంటే చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. 


సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో  పొట్ట ఈ మచ్చలు ఏర్పడతాయి. సాగిన గుర్తులు చర్మంపై ఏ ప్రదేశంలోనైనా ఏర్పడవచ్చు. అయితే పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను పాటించటం వల్ల స్వల్ప వ్యవధిలోనే అమ్మలు స్ట్రెచ్ మార్క్స్ ను అతి సులభంగా పోగొట్టుకోవ‌చ్చు.


- బాదం నూనె, షుగ‌ర్‌, క‌ల‌బంద ర‌సం మ‌రియు విట‌మిన్ ఈ ఉండే క్రిమ్‌ను తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట బాగా రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అవి తొల‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.


- మ‌న ఆహారంలో పాలు ఉత్పత్తులు, విటమిన్ కె అధికంగా కలిగిన ఆహారాలు, లివర్, ఆకుకూరలు, మరియు టమోటాలు వంటివి చేర్చ‌కుంటే స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది.


- ప్ర‌తి రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆముదం స్ట్రెచ్ మార్క్స్‌పై రాసుకుంటే అవి త‌గ్గిపోవ‌డానికి బాగా స‌హాయ‌ప‌డుతుంది.


-  ల‌వంగ నునే లేదా అలోవిరా జెల్ లేదా లావెండర్ ఆయిల్  రోజు మార్క్స్ ఉన్న‌ చోట రాసుకుంటే స్ట్రెచ్ మార్క్సును పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.


- ప్రతి రోజూ మీరు తీసుకొనే ఆహారంలో విటమిన్ సి,  ప్రోటీనులు, విటమిన్ ఇ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి. వీటివల్ల శరీర పెరుగుదలకు, కొత్తకణాలు ఏర్పడటానికి, చర్మంలో వచ్చే మార్పులను తొలగించడానికి స‌హ‌క‌రిస్తాయి.


-  ఆకుకూరలు, సోయా బీన్స్‌లో జింక్ అధికంగా ఉంటుంది. మ‌న ఆహార‌శైలి వీటిని చేర్చుకుంటే స్ట్రెచ్ మార్క్స్ తొలిగిస్తుంది.


- మ‌రియు గర్భిణీగా ఉన్నప్పటి నుంచే బాదం నూనె ఆయా భాగాల్లో సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు.


- గుడ్డులోని పచ్చసొనతో స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట రాసుకుని మ‌ర్ద‌న చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సులువుగా స్ట్రెచ్ మార్క్స్ మొత్తం తొలగిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: