చలికాలం,ఎండాకాలం అనే తేడా లేకుండా చర్మంమీద నలుపు మచ్చలు రావడం, వయసు పెరిగే కొద్దీ ముడతలు పడడం లాంటివి సహజమే. కానీ మనలో చాలా మంది మెడ మీద నలుపు వచ్చిన, కొద్దిగా ముడతలు పడినా,కంగారు పడిపోయి డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అంతేకాకుండా మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్,కాస్మెటిక్స్ అంటూ ఎంతో ఖర్చు చేస్తుంటారు. వాటిని తెచ్చి ముఖంమీద, మెడ పైన అప్లై చేస్తూ,  ఫలితాలు రాక నిరాశకు గురి అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి మచ్చలైనా, ముడతలైనా ఇట్టే తగ్గుముఖం పడతాయి.

ఇందుకోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్ లో ముంచిన కాటన్ తో మెడను తుడిచి, ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్  కీరదోసకాయ రసంలో,  ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపి మిశ్రమంలా  తయారు చేయాలి.  ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా మూడు నుండి నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే, మెడమీద నలుపురంగు పోయి చర్మం టైట్ గా తయారవుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైప్ చేస్తే, కీరదోస చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది.

ప్రతిరోజూ శరీరానికి మాయిశ్చరైజర్ ఎంతో అవసరపడుతుంది. ఇందుకోసం ముఖ్యంగా బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనెను స్నానానికి ముందు ఒళ్ళంతా పట్టించుకోవాలి. అరగంట ఆగి స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా నిగనిగలాడుతుంది.

శీతాకాలంలో చేతులకు, కాళ్లకు కొబ్బరినూనె,ఆలివ్ ఆయిల్,బాదం నూనె, నువ్వుల నూనె ఇలాంటి వాటిలో ఏదో ఒక నూనెతో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి అందంగా తయారవుతాయి.

చలికాలంలో ఎక్కువగా పెదవులు పొడిబారినట్లు అయి  పగిలిపోతుంటాయి. అందుకోసం రాత్రి పడుకోబోయే ముందు నెయ్యి,వెన్న మరేదైనా నూనె రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా బయటకు వెళ్లేటప్పుడు ఏదైనా జెల్ లాంటివి రాసుకుంటే ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: