ప్రస్తుతం చాలా రకాల కారణాల వల్ల చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వారి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.ఇందుకోసం రకరకాల క్రీములు వాడకుండా న్యాచురల్ పద్ధతులను ఉపయోగించి ఈ సమస్యలను నయం చేసుకోవాలి.ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సమస్యకి టమోటా రసం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే గుణాలు  కళ్ల కింద నల్లటి వలయాలను చాలా సులభంగా తొలగించడానికి ఎంతగానో సహాయపడతాయి. దీని కోసం మీరు 2 టీస్పూన్ల టమోటా రసంలో 5 చుక్కల నిమ్మరసంని కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద ఒక 10 నిమిషాలు పట్టించి.. నీటితో బాగా శుభ్రం చేసుకోండి.. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే దోసకాయ ముక్క కూడా కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.


అందుకే దోసకాయ ముక్కలు కోసి కళ్ళపై ఒక 10 నిమిషాలు పాటు ఉంచండి. ఇలా ఒక పది రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా అంతేకాకుండా కళ్ల సమస్యలు కూడా చాలా సులభంగా తగ్గుతాయి.ఇంకా చాలా మంది కూడా అనారోగ్య సమస్యలు రాకుండా గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు. ఈ గ్రీన్‌ టీ తాగడం వల్ల ఖచ్చితంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈజీగా దూరమవుతాయి. ఇంకా అంతేకాకుండా గ్రీన్ టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో ముంచి..ఆ నీటిని పిండి కళ్ల దగ్గర పెట్టుకుంటే వలయాల సమస్య నుంచి చాలా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇంకా అలాగే కళ్ల కింద నల్లటి వలయాల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పచ్చి పాలను కళ్ల కింద అప్లై  చేయడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు పొందుతారని చర్మ సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: