కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కార్యదర్శి స్థాయి అధికారులు కార్యాలయాలకు రోజు విడిచి రోజు రావాలని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలోని ఉద్యోగులు ఇంటి నుండే పని చేయాలని కేంద్రం సూచించింది. 
 
ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల పేషీలలో పని చేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం రూపొందించిన నూతన మార్గదర్శకాలు రేపటి నుంచి అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని, కంప్యూటర్ కీ బోర్డులు ఎవరికి వారే శానిటైజ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: