దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి మనుషుల మద్య దూరం బాగా పెరిగిపోయింది.  శానిటైజర్, మాస్క్ తో పాటు బయటకు వస్తే తప్పని సరిగా సోషల్ డిస్టెన్స్ ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ బాగోతాలు బయట పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ సినీ నటులపై పడింది.. ఇప్పటికే కొంత మంది కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.


ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌మైన దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంటి అని మంద‌లించ‌డంతో ఈ వివాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. సంయుక్త‌పై దాడి చేసే క్ర‌మంలో పోలీసులు రంగ ప్ర‌వేశంతో చేయ‌డంతో ఆమె క్షేమంగా బ‌య‌ట‌ప‌డింది. అయితే త‌న‌పై సామాజిక కార్య‌కర్త‌లం అంటూ దాడి చేయ‌డానికి వ‌చ్చిన వారిని వీడియో ద్వారా చూపించింది. స్పోర్ట్స్ బ్రా ధ‌రించ‌డం నేరమా, ఇదేనా ఇండియాలో ఉన్న మాకు ఉన్న స్వాతంత్ర్యం అంటూ ప్ర‌శ్నించింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: