పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడే కొద్ది మరింత రంజుగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు పరస్పర ఘాటు వ్యాఖ్యలతో, ఆరోపణలతో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా బీజేపీ నేతలపై మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు బెంగాల్ లో చర్చనీయాంశం అయ్యాయి. ఎన్నికల వేళ బీజేపీ నేతలు మేని ఫెస్టో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మేని ఫెస్టో లో శరణార్ధులకు నెలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ అంశంపై చిదంబరం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. తొలి రోజే ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు ఆమోదం తెలుపుతుందని సంచలన వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకురాదల్చిన సీఏఏ చట్టం దేశంపై ఎంతో ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సిఏఏ ముస్లింలపై వివక్ష చూపుతుందని, లక్షలాది మంది భారతీయులు వారి పౌరసత్వాన్ని కోల్పోతారని ఆయన అన్నారు. లక్షలాది మంది పేద, చట్టాన్ని గౌరవించే పౌరులు, ముఖ్యంగా ముస్లింల మనస్సులో భయపెట్టడం ఈ సీఏఏ ఉద్దేశం. నిర్బంధ శిబిరాల్లో వేస్తారు’ అని చిదంబరం ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ ‘విష అజెండా’ను అడ్డుకోవడానికి అస్సాం, బెంగాల్ ప్రజలు నిర్ణయాత్మకంగా ఓటు వేయాలని చిదంబరం ఆయా రాష్ట్రాల ప్రజలను కోరారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: