స్టాక్‌మార్కెట్ల మహాపతనం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే అంచనాతో కరోనా భయాలు వెంటాడంతో  స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.  దేశంలో రెండోదశలో కరోనా సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడి దారులను వణికించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. దేశంలో కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఆర్థికవ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు, లాక్‌డౌన్‌ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సోమవారం భారీ అమ్మకాలకుదిగారు.

ఇంట్రా డేలో  సెన్సెక్స్ 1,470 పాయింట్లు పడిపోయి 47,362 పాయింట్లకు పతనమైంది.  నిఫ్టీ కూడా ఏకంగా 426 పాయింట్ల నష్టంతో 14200కు దిగువకు చేరింది.  దీంతో ఇంట్రా డేలో దాదాపు 6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే మార్కెట్ల భారీ పతనంతో రూ .5.82 లక్షల కోట్ల మేర క్షీణించడంతో బీఎస్‌ఇ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లోని రూ. 205.71 లక్షల కోట్లతో పోలిస్తే  రూ. 199.89 లక్షలకు కోట్లకు పడిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: