మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ కీలక ప్రకటన  చేసింది. హత్యకు సంబంధించి సమాచారం తెలపాలని ఓ ప్రకటన విడుద‌ల చేసింది. సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల న‌జ‌రానా కూడా ఇస్తామని సిబిఐ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంతే కాకుండా వివ‌రాలు తెలిపిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా సిబిఐ విచారణలో భాగంగా వందల మందిని విచారణ చేసిన సంగ‌తి తెలిసిందే. గడచిన 80 రోజులుగా కడప, పులివెందులలో సిబిఐ విచారణ జ‌రుపుతోంది. 

ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వివేకా డ్రైవ‌ర్ సునీల్ యాదవ్ విచారణతో కొలిక్కివ‌చ్చింద‌ని అంతా భావించారు. కానీ అకస్మాత్తుగా సిబిఐ ప్రకటనతో అందరిలో ఆశ్చర్యం నెల‌కొంది. ఇక ఈ కేసులో కీల‌క అనుమానితుడిగా భావించిన సునీల్ యాద‌వ్ నుండి కూడా ఎలాంటి ఆధారాలు సీబీఐ కి ల‌భించ‌లేద‌ని స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: