నైరుతి చైనాలోని సిచువాన్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది, వరుసగా భూమి చాలా సేపటి దాకా కంపించిందని అంటున్నారు. ఇక రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైన ఈ భూకంపం వల్ల కనీసం ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, అలాగే పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని నివేదికలు బయటకు వస్తున్నాయి. ఫుజి టౌన్‌షిప్‌లోని కయోబా గ్రామంలో ఈ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉదయం 4:33 గంటలకు భూకంపం సంభవించిందని అంటున్నారు. చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ (CENC) ప్రకారం, భూకంప కేంద్రం 29.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 105.34 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది, అంతేకాక  భూకంపం 10 కి.మీ లోతులో సంభవించిందని, తదుపరి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నివేదిక పేర్కొంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: