ఆర్కే భార్య శిరీష మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఆర్కే ఓ గొప్పవ్యక్తీ..ప్రజా సమష్యలపై ఆయన పోరాటం అమోఘ మైంద‌ని చెప్పారు. భర్త ఆర్కేతో పాటు.. కుమారుడు మున్నా అమర వీరత్వం పొందడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని శిరీష స్ప‌ష్టం చేశారు. తాను ఒంటరినైపోయాననే భాద ఇప్పటికీ ఎప్పటికీ ఉండదని శిరీష అన్నారు. అలకూరపాడులోని కుమారుడు మున్నా స్మారక స్థూపం పక్కనే ఆర్కే స్మారక చిహ్నం ఏర్పాటు అనేది అందరితో క‌లిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని శిరీష చెప్పారు. 

ఆర్కే మృతి చెందడం బాధాకరమ‌ని శిరీష ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినప్పటికీ ఆయన లాంటి గెరిల్లా ఉద్యమకారులు మ‌ళ్లీ పుట్పుకొస్తారని శిరీష వ్యాఖ్యానించారు. ఆర్కే మృతి తో ఉద్యమం ఆగిపోతుందని.... ప్రభావం తగ్గిపోతుందనడం సరైంది కాదని అక్క‌డ‌కు విచ్చేసిన అమ‌ర వీరుల బంధుమిత్రుల సమితి కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: