బాల‌య్య‌ సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పాటలు ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచిపోయి ఉర్రూత‌లు ఊగిస్తూ ఉంటాయి. అలా బాలయ్య సినిమాలో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన పాటల్లో దంచవే మేనత్త కూతురా అనే పాట కూడా ఒకటి. అయితే ఈ పాట అంటే మంచు లక్ష్మికి కూడా ఎంతో ఇష్టం అట‌.... ఈ విషయాన్ని మంచు ల‌క్ష్మీ బాల‌య్య టాక్ షోలో వెల్లడించింది. అంతే కాకుండా దంచవే మేనత్త కూతురా అనే పాటకు షోలో మంచు ల‌క్ష్మీ డాన్స్ చేస్తానని చెప్పింది. 

ఇక ఈ షోలో మంచు లక్ష్మి ఆ పాట వేయించుకుని డాన్స్ చేయ‌డ‌మే కాకుండా బాలయ్యను కూడా త‌నతో స్టెప్పులు వేయాలంటూ రిక్వెస్ట్ చేసింది. దాంతో ఇద్దరూ కలిసి ఆ పాటకు డాన్స్ చేశారు. సాధార‌ణంగా స్టార్ హీరోలు డ్యాన్స్ చేయ‌డానికి వెన‌కాడ‌తారు కానీ బాల‌య్య మాత్రం హుషారుగా స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నాడు. ఇక దంచవే మేనత్త కూతురా అనే పేరుతో మంచు విష్ణు టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారట. ఆ విషయం మోహన్ బాబు కు తెలియకుండా విష్ణు చేశారట. అయితే ఆ టైటిల్ కు నేను స్టోరీ ఇస్తానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: