భారత దేశ చిత్రపటంలో అగ్రభాగాన ఉన్న జమ్మూ కాశ్మీర్ లో తుపాకుల మోత మోగుతోంది. 2022 జనవరి నెలారంభం నుంచి ప్రశాంత కాశ్మీర్ లో తుపాకులు గర్జిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఎన్ కౌంటర్ లలో ఎంత మంది మృతి చెందారో తెలుసా మీకు ?
  గత కొద్ది గంటలుగా అక్కడ నిరాటంకంగా తీవ్రవాదుల ఏరివేత జరుగుతుండటం కారణంగా  కాశ్మీర్ లోయలో తుపాకుల శబ్దం జనజీనవానికి వినిపిస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం  శనివారం  రాత్రి నుంచి ఆదివారం వరకూ ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. భారత దేశ భద్రాత దళాలకు పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్థలకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. పాకిస్తాన్ అండదండలతో నడిచే  జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన తీవ్రవాదులు హతమయ్యారు.
జైషే సంస్థకు చెందిన కీలక నేత జహీద్ వానీ తోపాటు, పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాది  చోటు అలియాస్ జఫీల్ లను హతమార్చినట్లు పోలీసు వర్గాల సమాచారం.  బద్గామ్ పరిసర ప్రాంతాలలోనూ తూపాకుల గర్జనలు  సామాన్యులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్ లలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: