కోట్లాది భారతీయులు గర్వంతో తలెత్తుకుంటున్న సందర్భమిది. అంతర్జాతీయ ఆస్కార్‌ వేదిక మీద చీరకట్టుతో మన వనితలు అవార్డు అందుకున్న సందర్భమిది.బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. 'హౌలౌట్', 'హౌ డు యు మెసర్ ఎ ఇయర్', 'ది మార్టా మిచెల్ ఎఫెక్ట్' ఇంకా అలాగే 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' వంటి డాక్యుమెంటరీలు ఈ అవార్డు కోసం ఎంతగానో పోటీ పడ్డాయి. ఇక నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించడం జరిగింది. ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుని…అంతర్జాతీయ వేదికపై మన భారత దేశం మీసం మెలేసింది. 


ఇక ఈ డాక్యుమెంటరీని కార్తికీ గాన్‌స్లేవ్స్ తెరకెక్కించగా, గునీత్‌ మోంగా నిర్మించడం జరిగింది. కుట్టునాయకన్‌ అనే గిరిజన ఫ్యామిలీలో కలిసి పెరిగిన ఓ ఏనుగు కథ ఇది. ఐదేళ్ల పాటు ఈ డాక్యుమెంటరీ షూటింగ్ సాగింది. రఘు అనే ఓ ఏనుగు కథతో దీన్ని తెరకెక్కించారు. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉన్న రిలేషన్ ని ఈ డాక్యుమెంటరీలో చాలా గొప్పగా చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి ఇందులో చాలా చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: