టాటా బ్రాండ్ అంటే ఏమిటో టాటా బ్రాండ్ పై భారత్ లో ఎంత నమ్మకం ఉందో మరోసారి అందరికీ తెల్సివచ్చిన సందర్భం ఇది.ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ దాకా భారత్ లో అనేక వ్యాపారాల్లో విస్తరించిన టాటా ప్రతి రంగంలో తనదైన ముద్ర ఎలా వేసిందో, ఎంత ఖచ్చితత్వంతో పని చేసిందో, ఎంత విశ్వాసం పొందిందో ఆయా రంగాల్లో ఆ గ్రూప్ సంస్థ సాధించిన విషయాలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎయిరిండియాను మాతృ సంస్థ హోదాలో ప్రభుత్వ రంగం నుంచి దక్కించుకున్న సమయంలోనూ టాటా పై భారత్ లో ఎంత విశ్వాసం ఉందో ప్రజలకు, ప్రభుత్వాలకు అర్థమైంది. 18 వేల కోట్ల ఈ ఒప్పందంతో టాటా వశమైంది  ఎయిరిండియా.

 ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన డబ్బులతో పాటు ఎయిరిండియా రూపురేఖలు మార్చే పెట్టుబడుల కోసం రుణాలు తీసుకుంది టాటా. భారత్ లో ఎయిర్ లైన్స్ నిర్వహణ కష్టతరమైన వ్యవహారం. అలాగే ఎయిర్ లైన్స్ సంస్థలకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపవు. సాధారణంగా అసలు బ్యాంకుల నుంచి లోన్లు పొందాలంటే అదో మహా ప్రహసనం. సామాన్యుల నుంచి సంస్థల దాకా అందరూ బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాల్సిందే, వారు చెప్పిన వడ్డీరేట్లకు ఒప్పుకోవాల్సిందే. కానీ టాటా విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది. ఎయిర్ ఇండియాని కొనాలని నిర్ణయించుకొని బిల్లు దక్కించుకొని అందుకోసం రుణాలు పొందాలని టాటా సన్స్ అనుకున్నదే తడవుగా బ్యాంకులు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ,ప్రైవేట్ అన్న తేడా లేకుండా అన్ని బ్యాంకులు టాటాసన్స్ కి రుణాలు ఇచ్చేందుకు క్యూ కట్టాయి. నిబంధనలు సవరించాయి,వడ్డీరేట్లు తగ్గించాయి. అప్పులు మేమిస్తామంటే, మేమిస్తామంటూ పోటీ పడ్డాయి. అనేక బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం,వడ్డీరేట్లు ఇతర నిబంధనలు దాదాపు ఒకేలా ఉండటంతో ఎవరి నుంచి అప్పు తీసుకోవాలనే ఇరకాటం లో ఉంది. దానిపైన టాటా సన్స్ నిర్ణయం తీసుకోనున్నారు. విస్తృత సంప్రదింపుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణాలు తీసుకుంది. హెచ్ డిఎఫ్సీ నుంచి కూడా రుణాలు తీసుకున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయాన్ని అటు బ్యాంకు కానీ ఇటు టాటా సన్స్ కానీ ధ్రువీకరించలేదు.

అటు టాటా సన్స్ ఎస్బిఐ,బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. కేవలం 4.25 శాతం వడ్డీకే టాటా సన్స్ కు ఆ రెండు బ్యాంకులు 15 వేల కోట్లను రుణం మంజూరు చేశాయి.ఎస్బిఐ నుంచి 10 వేల కోట్ల రుణం తీసుకుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 5 వేల కోట్ల అప్పు తీసుకుంది.నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాని టాటా సన్స్ గాడిన పెట్టి మళ్ళీ లాభాల బాటలోకి మళ్ళించగలదని బ్యాంకులు నమ్మాయి. తాము ఇచ్చిన అప్పు వడ్డీతో సహా వసూలు అవుతుందని విశ్వాసం ఉంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: