ఇక సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఇప్పుడు చాలా మార్పులు అనేవి చోటుచేసుకున్నాయి. వడ్డీ రేటు ఇంకా వడ్డీ జమ విధానాల్లో మార్పులు చేశారు.ఈ సుకన్య సమృద్ధి యోజన పధకంలో కొత్త నియమాలు చోటుచేసుకున్నాయి. మీరు కూడా మీ కుమార్తె భవిష్యత్ కోసం ఆలోచిస్తుంటే ఈ పధకంలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇక 21 ఏళ్లకే మీ అమ్మాయి లక్షాధికారి కావచ్చు. దీనికోసం రోజుకు మీరు 416 రూపాయలు పొదుపు చేస్తే చాలు. మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి మొత్తం 65 లక్షల రూపాయలవుతుంది. మీ అమ్మాయి భవిష్యత్ చదువు ఇంకా పెళ్లి ఖర్చులకు ఈ పథకం బాగా ఉపయుక్తమౌతుంది.ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది దీర్ఘకాలిక పధకం. ఇందులో పెట్టుబడి పెడితే మీ కుమార్తె చదువు ఇంకా భవిష్యత్ విషయంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని ఇందులో పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడీ స్కీమ్‌లో చాలా మార్పులు కూడా వచ్చాయి. ఇక కొత్త నియమాల ప్రకారం...అకౌంట్ లో వడ్డీ పొరపాటున జమ అయితే..తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా వార్షిక వడ్డీ వచ్చేసి ప్రతి ఆర్ధిక సంవత్సరం చివర్లో క్రెడిట్ అవుతుంది. ఇంతకుముందైతే..మీ కుమార్తెకు పదేళ్ల వయస్సుంటేనే ఈ అకౌంట్ ఆపరేట్ చేసుకునే వెసులుబాటు ఉండేది.


కానీ ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం 18 ఏళ్ల కంటే ముందు ఈ అకౌంట్ ఆపరేట్ చేసే పరిస్థితి లేదు.ఇంకా గతంలో ఈ పధకంలో ఇద్దరు కుమార్తెల ఖాతాలపై కూడా సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉండేది. అలాగే మూడో కుమార్తె అకౌంట్ పై ఉండేది కాదు. ఇక ఇప్పుడు కొత్త నియమాల ప్రకారం ఒక అమ్మాయి తరువాత ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలు కనుక పుడితే మాత్రం ఆ ఇద్దరికి కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. దీని ప్రకారం ఈ అకౌంట్ లో కనీసం ఏడాదికి 250 రూపాయలు జమ చేయాలి. ఇక అలా కానిపక్షంలో ఎక్కౌంట్ డీఫాల్ట్ అవుతుంది. కానీ కొత్త నియమాల ప్రకారం ఒకవేళ ఖాతాను రెండోసారి కనుక యాక్టివ్ చేయకపోతే మెచ్యూరిటీ అయ్యేంతవరకూ అందులో ఉన్న నగదుపై వడ్డీ లభిస్తుంది.ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద తెరిచిన అకౌంట్ ను గతంలో రెండు సందర్భాల్లోనే క్లోజ్ చేయడానికుండేది.ఇక కుమార్తె చనిపోయినప్పుడు , కుమార్తె నివాసముండే చిరునామా మారినప్పుడు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: