ఎటువంటి సమస్య లేకుండా చాలా ఈజీగా పొందే లోన్ పర్సనల్ లోన్‌. కాకుంటే దీనికి ఖచ్చితంగా మంచి సిబిల్‌ స్కోర్‌ అనేది ఉండాలి. ఇది ఉంటే చాలు క్షణాల్లో డబ్బులు అకౌంట్లో క్రెడిట్  అవుతాయి.అందుకే చాలా మంది కూడా పర్సనల్ లోన్‌  తీసుకోడానికి  ఎక్కువ ఆసక్తి చూపుతారు.ఇక వేరే ఇతర లోన్‌ కావాలన్నా భూమి లేదా బంగారం అనేది బాగా అవసరపడుతుంది. కానీ పర్సనల్‌ లోన్‌కి మాత్రం అసలు ఇవేవి అవసరం లేకుండానే పొందొచ్చు.అందుకే ఈ పర్సనల్‌ లోన్‌కు వడ్డీని ఎక్కువగా వసూలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్‌బీఐ ఈమధ్య రెపో రేటు పెంచిన తర్వాత వడ్డీ రేట్లు అయితే బాగా పెరిగాయి. ఇక ఇలాంటి సమయంలో తక్కువ వడ్డీ రేటుకే వ్యక్తిగత రుణాలను అందిస్తోన్న కొన్ని  మంచి బ్యాంకులు ఇంకా వడ్డీ రేట్ల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 20 లక్షల దాకా వ్యక్తిగత రుణాలపై మొత్తం 84 నెలల కాలవ్యవధికి 8.90 శాతానికి పైగా వడ్డీని వసూలు చేస్తుంది.అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 84 నెలల కాలవ్యవధికి గాను రూ. 20 లక్షల దాకా రుణం ఇస్తోంది.ఇక దానిపై వడ్డీ విషయానికి వస్తే 9.75 శాతం నుంచి 14.25 శాతం ఉంటుంది.అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 60 నెలల కాలవ్యవధికి గాను మొత్తం రూ. 10 లక్షల దాకా రుణాన్ని ఇస్తోంది,  వడ్డీ విషయానికి వస్తే 9.80 శాతం నుంచి 16.35 శాతం దాకా వసూలు చేస్తున్నారు.కరూర్ వైశ్యా బ్యాంక్ 12 నుంచి 60 నెలల దాకా 10 లక్షల రుణానికి 9.85 శాతం నుంచి 12.85 శాతం దాకా వడ్డీని వసూలు చేస్తుంది.అలాగే ఐడీబీఐ బ్యాంక్‌ రూ. 25,000 నుంచి రూ. 5 లక్షల దాకా రుణాలపై 12 నుంచి 60 నెలల దాకా 9.90 నుంచి 15.50 శాతం దాకా వడ్డీని వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: