దుబాయ్ లోని ఓ హోటల్ లోని బిరియాని చాలా ఖరీదు అని అంటున్నారు.బాంబే బారో హోటల్ వారు తమ మొదటి యానివర్సరీ సందర్భంగా అక్కడ స్పెషల్ బిర్యానీని తయారు చేసి అందిస్తున్నారు. అయితే ఆ బిర్యానీలో పైన గార్నిష్ కోసం 23 క్యారెట్ల బంగారాన్ని వాడారు.అందుకని ఆ బిర్యానీ చాలా ఖరీదు అయింది. దాని ధర 1000 దిర్హామ్‌లు. మన కరెన్సీలో దాదాపుగా రూ.20వేలు. అవును నిజమే. ఇక ఆ బిర్యానీని 5-6 మంది సులభంగా తినవచ్చు. అందులో బిర్యానీతోపాటు కాశ్మీరీ ల్యాంబ్ సీక్ కబాబ్, ఓల్డ్ ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్‌పూత్ చికెన్ కబాబ్, మొగల్ కోఫ్తా, మలయ్ చికెన్లను కూడా అందిస్తారు.