దేశంలో డీజిల్ , పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది సొంత వాహనాలను వాడటం మానేసి బస్సులలోను, రైల్ లోనూ ప్రయాణిస్తున్న దుస్థితి దాపురించింది. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర వందకు పైగా పలుకుతుంది. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ డెలివరీ పార్టనర్స్ (ఫుడ్ డెలివరీ బాయ్స్)కు రెమ్యూనరేషన్ పెంచింది. జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.