
అయితే తర్వాత రోజు అత్తారింటి నుంచి ఇంటికి వచ్చిన పెద్దకొడుకు తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారు అంటూ తమ్ముడిని అడిగితే తనకు తెలియదు అంటూ సమాధానం చెప్పాడు. కానీ ఆ తర్వాత రోజు ఇంట్లో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పెద్దకొడుకు. ఇక పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ లో వెలుగులోకి వచ్చింది. జై రామ్ సింగ్ సుందరీబాయి దంపతులకు ఇద్దరు కొడుకులు.. పెద్దకొడుకు హేమంత్ వివాహం చేసుకునే అత్తారింట్లో ఉంటుండగా 17 ఏళ్ళ చిన్న కొడుకు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
ఇకపోతే ఇటీవల తల్లి దండ్రులను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టగా.. దుర్వాసన రావడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు హేమంత్. అయితే ఇక హేమంత్ సోదరుడిని అదుపు లోకి తీసుకొని విచారించారు పోలీసులు.. అయితే తన తల్లి దండ్రులు ఎప్పుడూ అన్నయ్య ని ప్రేమగా చూసే వారిని అందుకే కోపం తో చంపేసాను అంటూ పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించాడు సదరు యువకుడు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు పోలీసులు.