అవసరాలకు ముందుగా డబ్బులు వస్తే చాలు.. తర్వాత బాధలు తర్వాతవి అని చాలా మంది అనుకుంటారు.. అయితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి ఎవరూ ఊహించలేరు..ఆన్ లైన్ లోన్ యాప్ లతో చాలా మంది జీవితాలను కోల్పోయిన సంగతి తెలిసిందే..అందుకే ఇలాంటి వాటి జోలికి వెల్లరాదు అని పోలీసులు నెత్తి నోరు బాధుకొని చెబుతున్నారు.డబ్బు మీద వ్యామోహంతో  అలాంటి వాటికి బలవుతున్నారు.లోన్ యాప్ నిర్వాహకులు న్యూడ్ ఫొటోలతో చేసే వేధింపులు తాళలేక కొందరు అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.


లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాల గురించి రోజూ వార్తలు వస్తున్నా ఇంకా కొంతమందిలో మార్పు రావడం లేదు..హైదరాబాద్ కి చెందిన ఓ యువతి లోన్ యాప్ లో రుణం తీసుకుంది. అయితే సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో యాప్ ప్రతినిధి మనీష్ కుమార్ బరితెగించాడు. యువతి ఫొటోలను న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ న్యూడ్ ఫొటోలను యువతికి పంపి వేధించాడు. అంతటితో ఆగలేదు. ఆమె బంధువులకు, స్నేహితులకు కూడా పంపి వేధించాడు..అతని వెధింపులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యువతి పోలీసులను ఆశ్రయించింది.


బాధితురాలి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మొబైల్ ట్రాక్ ద్వారా అతడు బిహార్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.టెక్నాలజీ ద్వారా నిందితుడు బిహార్‌లోని సివాన్‌ జిల్లా గోపాల్‌పూర్‌ కోఠిలో ఉన్నట్టు తెలుసుకున్నామని పోలీసు తెలిపారు. మనీష్‌ కుమార్‌ను అరెస్టు చేసి బిహార్ నుంచి హైదరాబాద్‌ తీసుకొచ్చిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.వికాస్‌ కుమార్‌ అనే లోన్‌ యాప్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. వాయిదాలు సకాలంలో చెల్లించని వారి ఆధార్‌, పాన్‌ కార్డు, ఫొటోను వికాస్‌కు.. మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అసభ్య చిత్రాలను లోన్ తీసకున్న వారి ఫోన్‌లో ఉన్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లను ఎంపిక చేసుకొని వారి మొబైల్‌ ఫోన్లకు మనీష్‌ పంపిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వికాస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: