సాధారణంగా పోలీసులు దగ్గరికి ఎన్నో రకాల కేసులు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని కేసులలో డీఎన్ఏ టెస్ట్ అనేది ఎంతో కీలకం గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గుర్తు పట్టలేనంతగా దారుణం గా మారిపోయిన మృతదేహాలను డీఎన్ఏ టెస్ట్ ఆధారంగానే గుర్తిస్తూ ఉంటారు. ఎలాంటి కేసులో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు అన్న విషయంప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో..ఏయే సందర్భాలలో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ఈ విషయాన్ని స్పష్టం గా చూపించారు.



 ఇకపోతే ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే డీఎన్ఏ టెస్ట్ చేయడం గురించి విన్నాము చూశాము. కానీ మొదటిసారి ఏకంగా ఒక దున్నపోతు కి డిఎన్ఏ టెస్ట్ చేయడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఇలా దున్నపోతు డిఎన్ఏ  టెస్ట్ చేయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా.. ఆ దున్నపోతు  దొంగతనానికి గురి కావడమే. దొంగతనానికి గురైన దున్నపోతును గుర్తించేందుకు పోలీసులు డీఎన్ఏ టెస్ట్ చేసి వాటి ఆధారంగా ముందుకు సాగాలి అని అనుకున్నారు.


 ఉత్తరప్రదేశ్ లోని షాంలి ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. శాంలి జిల్లాలోని అహ్మద్ నగర్ లో కష్యాప్ అనే వ్యక్తికి ఆవులు కొట్టం ఉంది. ఈ క్రమంలోనే 2020లో ఒక దున్నపోతు దొంగలించారు అంటూ సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి చెప్పిన విధంగానే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సహరాన్పూర్ భీంపూర్ లో దున్నపోతును గుర్తించారు. అయితే వారు గుర్తించిన దున్నపోతు వారు వెతుకుతున్న దున్నపోతు ఒకటేనా తెలుసుకోవడానికి లేకుండా తల్లి గేదెకు సంబంధించిన డిఎన్ఏ తో పోల్చి చూసేందుకు దున్నపోతు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: