ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వారి ప్రాణాలను రిస్కులో పెట్టుకోవడమే కాదు ఇక అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను కూడా తీసేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడిపితే ఊరుకునే ప్రసక్తేలేదని జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎంతోమంది వాహనదారుల  తీరులో మార్పు రావడం లేదు.


 ఫుల్లుగా మద్యం తాగడం ఇక ఆ తర్వాత వాహనం నడపడం ఆ పై ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నప్పటికీ మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారి సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఒకరకంగా నేటి రోజుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగానే అని చెప్పాలి. కానీ ఇక నుంచి మద్యం తాగి వాహనం నడిపితే ఇక బండి స్టార్ట్ అవ్వదు.


 అదేంటి అలా ఎందుకు జరుగుతుంది మనం మద్యం  తాగినట్లు వాహనానికి ఏమైనా తెలుస్తుందా బండి స్టార్ట్ కాకపోవడానికి అని అనుకుంటున్నారు కదా.. నిజంగానే మీరు చెప్పినట్లు ఇక వాహనానికి మద్యం తాగినట్లుగా తెలియ బోతుంది. జార్ఖండ్లోని ధన్ బాద్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. భారత్ కోకింగ్ కోల్ లో పనిచేసే అజిత్ యాదవ్, మనీష్ సిద్ధార్థ్ వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా డ్రైవర్ ఆల్కహాల్ తాగితే ఆ పరికరంలో ఉంటే సెన్సార్ పసిగట్టి బజార్ మోగిస్తోంది. ఆ సిగ్నల్ ఇంధన పంపుకు వెళ్తుంది. దీంతో ఇక ఇంధన సరఫరా నిలిచిపోతుంది. ఇక బండి స్టార్ట్ అవ్వదట. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: