సాధారణంగా కొన్ని కొన్ని సార్లు సరదాగా చేసిన పనులు చివరికి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంటాయి అన్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే స్నేహితులు తోటి స్నేహితులకు ఆటపట్టించడం చేస్తూనే ఉంటారు. కానీ ఆటపట్టించడం మితిమీరితే మాత్రం చివరికి జరగకూడదని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని కొన్ని సార్లు సరదా కోసం చేసిన పనులు ప్రాణాలను గాల్లో కలిసిపోయే పరిస్థితులను కూడా తీసుకు వస్తాయ్. ఇక్కడ జరిగింది కూడా ఇలాంటి కోవకు చెందిన ఘటనే అని చెప్పాలి.


 గుజరాత్ లోని మోహనస జిల్లాలో కడి తాలూకా లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. చట్రల్ కడి హైవే లో ఒక లేబర్ కంపెనీ ఉంది. అయితే కొంత మంది కార్మికులు అందులో పని చేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది స్నేహితులు కలిసి సరదాగా చేసిన పని ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కులదీప్ విజయ్ అనే యువకుడు కు పదహారేళ్ల బాలుడిని సరదాగా ఆట పట్టించాలి అనుకున్నాడు. యువకుడి పురుషుల నాలంలో ఎయిర్ కంప్రెసర్ పైపు జోప్పించి గాలిని వదిలారు.  దీంతో కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు సదరు యువకుడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.


 వెంటనే అతన్ని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయాడని నిర్ధారించారు. ఇలా సరదా కోసం చేసిన పని ఏకంగా ఒకరి ప్రాణాలు పోయేలా చేయడంతో అక్కడ అధికారులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారగా.. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండటం గమనార్హం. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదొక్కటి మాత్రమే కాదు ఇటీవలి కాలంలో ఇలా చిన్నచిన్న సరదాల కోసం ఎంతోమంది చేస్తున్న పనులు చివరికి ప్రాణాల మీదికి తెస్తూ  ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: