సాధారణంగా గాల్లోకి ఎగిరాల్సిన  ఫ్లైట్ ఆగిపోయింది అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుందని చెప్పాలి. ఏదైనా టెక్నికల్ సమస్య ఏర్పడినప్పుడు లేదా వాతావరణం సహకరించదని  భావించినప్పుడు మాత్రమే ఇక సిబ్బంది అటు విమానాలను నిలిపి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరి కోసం ఫ్లైట్ ఆలస్యం అవ్వడం ఎప్పుడూ జరగదు అని చెప్పాలి. ఇక అప్పుడప్పుడు జరిగినట్లు గానే ఇక్కడ ఒక విమానం వెళ్లాల్సిన సమయం కంటే లేటయింది. ఎంత లేట్ అంటే దాదాపు ఆరు గంటల పాటు. ఇంత లేట్ అయింది అంటే ఏదో పెద్ద కారణమే ఉంది ఉంటుంది అని అనుకుంటున్నారు కదా.


 అలా అనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే విమానం 6 గంటలు  లేట్ కావడానికి కారణం ఒక సీట్లు ఉన్న వ్యక్తి పక్క సీట్లో ఉన్న వ్యక్తి మొబైల్ లో చాటింగ్ చూసినందుకు.  షాక్ అవుతున్నారు కదా. ఇది నిజంగానే జరిగింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. విమానం మంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.. ఇక ప్రయాణికులందరూ కూడా విమానంలో  ఎక్కారు. సీట్ బెల్టులు బిగించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు  ఒక అమ్మాయి తో చాటింగ్ చేస్తున్న సమయంలో అతని పక్కనే కూర్చున్న మరో వ్యక్తి ఆ చాటింగ్ ని చూడటం మొదలుపెట్టాడు.


 అయితే ఇలా సదరు వ్యక్తి అమ్మాయితో చేస్తున్న చాటింగ్ కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఈ క్రమంలోనే వెంటనే భద్రతా సిబ్బందికి ఈ విషయం చెప్పాడు. అయితే వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు అందర్నీ కూడా ఖాళీ చేయించారు. అనంతరం విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అని చెప్పాలి. అయితే అమ్మాయితో చాటింగ్ చేస్తున్న సమయంలో అందులో యు ఆర్ ద బాంబర్ అనే ఒక మెసేజ్ చూసి హడలిపోయాడూ. ఈ ఒక్క ఒక్క మెసేజ్ ఊహించని తంటాలు తీసుకువచ్చింది. విమాన సిబ్బంది ఇలా అమ్మాయితో చాటింగ్ చేసిన ప్రయాణికుడిని ప్రశ్నించగా. తాము మంచి స్నేహితులమని.. మా మధ్య సరదా కోసమే అలా చాటింగ్ చేసుకున్నాము అంటూ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: