
అయితే కొంతమంది సర్దుకు పోతే మరి కొంతమంది మాత్రం ఏకంగా పిల్లలు పుట్టకపోవడంతో భార్యదే లోపం ఉంది అని భావించి చిత్రహింసలకు గురి చేయడం లాంటి ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని రాజధాని నగరమైన లక్నోలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఆరు సంవత్సరాలు గడిచిన పిల్లలు కావడంలేదని ఓ వ్యక్తి భార్యను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ప్రైవేట్ భాగలపై దాడి చేసి దారుణంగా హింసించాడు.
లక్నోకు చెందిన రవీంద్రకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు కాలేదు. హాస్పిటల్ల చుట్టూ తిరిగిన పూజలు పునస్కారాలు చేసిన లాభం లేకుండా పోయింది. దీంతో పిల్లల విషయంపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే భర్త తీరుతో విసిగిపోయిన భార్య గత ఎనిమిది నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. ఇకపోతే ఇటీవల అత్తారింటికి వెళ్లిన రవీంద్ర ఇంటికి రావాలని భార్యను ఒప్పించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెతో అసహజ సెక్స్ కి ప్రయత్నించాడు. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో ఇక మర్మాంగాలపై బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు గమనించి బాధితురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.