సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన బంధం అని చెప్పాలి. ఎందుకంటే మూడుముళ్ల బంధంతో ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నూరేళ్లపాటు ఒకరికి ఒకరు తోడునీడగా కలిసి మెలిసి ఉండాల్సి ఉంటుంది. ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది. అయితే అప్పటివరకు జీవితం ఎలా ఉన్న అటు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం సరికొత్త జీవితం మొదలవుతుంది అని పెళ్లి చేసుకున్న వారు చెబుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అలకలు లాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడే ఇక వారి బంధం మరింత బలపడుతుందని అంటూ ఉంటారు పెద్దలు.


 కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల బంధం తలెత్తుతున్న వివాదాలు, మనస్పర్ధలు చూసిన తర్వాత ఇక పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువకులు సైతం పెళ్లిని విరమించుకునే పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో భార్యాభర్తల బంధం అనేది ఆత్మహత్యలకు హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వెరసి ఇక చిన్నపాటి గొడవలే ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి అని చెప్పాలి. ఇటీవల బీహార్ లోని పాట్నాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి ఇల్లు తగలబడే పరిస్థితికి కారణమైంది.


 గొడవ పడిన ఇద్దరు భార్యాభర్తలు కూడా అద్దెకు ఉంటున్న ఇంటిని తగలబెట్టారు. భర్త బయటకు వెళ్లే సమయంలో తన భార్య కావాలని స్వెటర్ను ఉతకడానికి నీళ్లలో నానబెట్టింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లోని మిగతా బట్టలు అన్నింటికీ కూడా నిప్పు అంటించాడు. దీంతో క్షణాల్లో ఇల్లంతా మంటలు అంటుకున్నాయి. ఇక చూస్తుండగానే ఇల్లు మొత్తం కాలిపోయింది అని చెప్పాలి. అయితే చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చివరికి మంటలను ఆర్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: