ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురానుభూతులను పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కసారి ప్రేమలో పడిన జంట ఇక ఈ లోకాన్ని మరిచిపోయే విధంగా ప్రేమను ఆస్వాదిస్తూ మునిగి తేలుతూ ఉంటారు అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఇక ప్రేమలో పడిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. ఎలా ఆలోచిస్తారు అన్న విషయం తెలిసి కొంతమంది షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ప్రేమ బ్రేకప్ అయితే ఇక  పిచ్చి వాళ్ళలా మారిపోతారు అన్నది ఇప్పటివరకు సినిమాల ద్వారా నిజ జీవితంలో కూడా కొన్ని కొన్ని సార్లు చూసాం. కానీ ఎంతో మధురానుభూతులు పంచే ప్రేమ చివరికి ఒక వ్యక్తిని దొంగగా మారుస్తుంది అన్నది మాత్రం ఇక్కడగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి.. ఇక నేరాలకు పాల్పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు యువకులు. ఈ క్రమంలోనే కొంతమంది దొంగలుగా మారిపోయి చోరీలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక యువకుడు గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయడానికి చేసిన పని కాస్త అతని జీవితం నాశనం అయ్యే పరిస్థితులను తీసుకువచ్చింది. ఏకంగా ప్రియురాలిపై అతి ప్రేమతో ఆమెను ఆకట్టుకోవడానికి ఖరీదైన బైకులు దొంగతనాలు చేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. మహారాష్ట్ర లోని తానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుభం భాస్కర్ అనే 19 యువకుడు ఖరీదైన బైక్లు దొంగలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇక అతను వద్ద నుంచి 16.03 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇలా దొంగతనాలు చేయడానికి కారణం ఏంటి అని అతని ప్రశ్నించగా..ఇక ప్రియురాలని ఇంప్రెస్ చేయడానికి ఇలా దొంగతనాలు చేసాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: