ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితానికి అసలు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నప్పటికీ అటు మనిషి అనే జీవి మాత్రం ఎంతో ప్రత్యేకం చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆలోచన తత్వమే ఇక మనిషిని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. అయితే ఇక పరిస్థితులకు తగ్గట్లుగా ఎంతో విచక్షణతో ప్రవర్తించడం కేవలం మనిషికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుగవుతుంది అన్నది అర్థమవుతుంది.


 ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో తెలివిగా ఆలోచించి సమస్య నుంచి బయట పడాల్సిన మనిషి.. చివరికి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ విలువైన ప్రాణాలు చేజేతులారా తీసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్నచిన్న కారణాలకే ప్రాణాలను తీసేసుకుంటూ కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితిని తీసుకువస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది అని చెప్పాలి. అతను ఒక డాక్టర్ ఇప్పుడు వరకు ఎంతో మందికి చికిత్స చేసి మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. కానీ ఇటీవల ఏకంగా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


 హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మజూర్ అనే డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన మజూర్ ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ అతని ప్రాణాన్ని నిలబెట్ట లేకపోయారు అని చెప్పాలి. చివరికి చికిత్స పొందుతూ డాక్టర్ మజూర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gun