ప్రస్తుతం వేసవి కాలం వచ్చింది  కాబట్టి చాలా ఎక్కువగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యాన్, ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో కరెంటు బిల్లు ప్రతిసారి వచ్చే దానికంటే కాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు,  నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక తాజాగా కరెంటు బిల్లు కూడా పెంచడం జరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. అయినా కూడా మనం ఈ వేడిని తట్టుకోలేక కూలింగ్ పరికరాలను ఎంచుకోక తప్పడంలేదు.

ముఖ్యంగా ఏసీని ఉపయోగించుకునేవారు అత్యధికంగా విద్యుత్ ని గ్రహిస్తూ ఉంటుంది. అయితే ఇలా ఇబ్బంది పడేవారు విద్యుత్తును ఆదా చేసుకోవాలంటే..16 డిగ్రీల బదులుగా 24 డిగ్రీల వద్ద ఏసీ ని పెంచుకున్నట్లు అయితే.. కావలసినంత చల్లదనం వస్తుంది. ఇక అంతే కాకుండా కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు.

ఇక ఇంట్లో ఉపయోగించే ఎల్ఈడీ బల్బుల లో రకరకాల బల్బులు వాడుతూ ఉంటారు.. వాటి అన్నిటికంటే ఎల్ఈడీ బల్బులు మనకు చాలా మేలు అని చెప్పవచ్చు. ఎందుచేత అంటే ఇతర బల్బు ల కంటే 90 % వరకు విద్యుత్తు ని ఆదా చేస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎల్ఈడి బల్బులను వినియోగించుకోవడం మంచిది.

ముఖ్యంగా మనం చేసే చిన్న తప్పులు ఏమిటంటే.. టీవీ రిమోట్ తో టీవీని ఆఫ్ చేయడం, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు వాటిని ఆఫ్ చేయకుండా వెళ్లడం వల్ల ఇది కూడా  విద్యుత్ ఎక్కువగా వినియోగిస్తుంది అని చెప్పవచ్చు.

మీరు ఉపయోగించుకునే ఏసీ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోవాలి.. మనం ఉపయోగించుకునే అవుట్డోర్ యూనిట్ నేరుగా సూర్యుడు కిరణాల పడడం వల్ల ఎక్కువ విద్యుత్తు ఉపయోగించుకుంటుంది.

ఐరన్ బాక్స్ తో బట్టలను ఇస్త్రీ చేసేవారు ఆ బట్టలు పొడిగా, మంచిగా వెచ్చగా ఉన్నప్పుడు చేస్తే అవి విద్యుత్ ని ఆదా చేస్తాయి.

ఫ్రిజ్జు ని వెంటిలేటర్ లేని ప్రదేశంలో ఉంచితే అది త్వరగా చల్లదనం అవుతుంది. ఆ తర్వాత కరెంట్ బిల్ ఆదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: