ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య నానాటికీ పెరుగుతోంది.. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసారు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. నాన్ సీఎస్జీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 53 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, లీగల్ ఆఫీసర్, మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ 2021 ఫిబ్రవరి 23న ప్రారంభం కానుంది.